Cricket: బెదిరింపు కాల్స్ వచ్చేవి..టీమ్ ఇండియా క్రికెటర్ వరుణ్

ఛాంపియన్స్ ట్రోఫీలో తన బౌలింగ్ తో అందరినీ మెస్మరైజ్ చేశాడు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. మూడు మ్యాచ్ లలో తొమ్మిది వికెట్లు తీసిన వరుణ్ కు 2021 నుంచి ఓ రెండేళ్లు చాలా కష్టంగా గడిచాయిట. బెదిరింపు కాల్స్ వచ్చేవని చెబుతున్నాడు వరుణ్. వివరాలు కింద ఆర్టికల్ లో..

New Update
cricket

Varun Chakravarthy

ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన వారిలో రెండవ స్థానంలో నిలిచిన బౌలర్ ఇండియన్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. మూడు మ్యాచ్ లలో తొమ్మది వికెట్లు తీశాడు. అంతేకాదు చాలా తక్కువ రన్స్ కూడా ఇచ్చాడు. ఇప్పుడంతా బాగానే ఉంది. ఇండియన్ టీమ్ లో చోటు దక్కింది..ఛాంపియన్స్ ట్రోఫీతో పేరూ వచ్చింది. కానీ 2021లో మాత్రం వరుణ్ చక్రవర్తి చాలా కష్టాలు పడ్డానని చెబుతున్నాడు. 2021 టీ20 ప్రపంచకప్ లో వరుణ్ ఆడాడు. అయితే అందులో పేలవమైన ప్రదర్శన చేశాడు. దీంతో కోపం తెచ్చుకున్న అభిమానులు అతనికి బెదిరింపు కాల్స్ చేసేవారుట. భారతదేశానికి తిరిగి రావద్దని హెచ్చరించారు. కొంతమంది తనను ఇంటి వరకూ కూడా వెంబడించారని వరుణ్ గుర్తు చేసుకున్నాడు. వాళ్ళకు భయపడి చాలా రోజులు ఇంట్లో దాక్కునే వాడిని. నేను విమానాశ్రయం నుండి తిరిగి వస్తుండగా, కొంతమంది నన్ను బైక్ మీద వెంబడించారని చెప్పుకొచ్చాడు. అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారని నేను అర్థం చేసుకోగలనని అన్నారు.

డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా..

2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత వరుణ్ ను ఇండియా టీమ్ లో నుంచి కూడా తొలగించారు. దాంతో అతని అంతర్జాతీయ క్రికెట్ ముగిసిపోయినట్టే అనుకున్నారు అంతా. తాను కూడా అలాగే అనుకున్నానని..డిప్రెషన్ లోకి వెళ్ళిపోయానని వరుణ్ చెప్పాడు. అవన్నీ తనకు చెడ్డ రోజులని చెప్పుకొచ్చాడు. కానీ కొన్ని రోజులకు తనను తాను మార్చుకున్నానని...మరింత ఎక్కువ ప్రాక్టీస్ చేసేవాడని చెప్పాడు. ఒక యూట్యూబ్ షోలో ఇవన్నీ చెప్పుకొచ్చాడు వరుణ్. ఒక సెషన్ లో 50 బంతులు ప్రాక్టీస్ చేసేవాడిని. సెలెక్టర్లు తనను పిలుస్తారో లేదో తెలియదు..కానీ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నా. కానీ ఇప్పుడు మూడు ఏళ్ళ తర్వాత అంతా మారిపోయింది. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నానని వరుణ్ చెప్పుకొచ్చాడు. 

Also Read: USA: ఏలియన్స్ ఉన్నాయి..అమెరికా నిఘా అధికారులు

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు