USA: ఏలియన్స్ ఉన్నాయి..అమెరికా నిఘా అధికారులు

ఏలియన్స్ ఉన్నాయా లేదా అనేది ఎప్పటికీ అంతుచిక్కని ప్రశ్న. ఎవ్వరూ కచ్చితంగా చూసింది లేదు. కానీ యూఎఫ్ వోలు, గ్రహాంతరవాసుల గురించి కథలు మాత్రం కోకొల్లలు. తాజాగా అమెరికా వెటరన్స్ కూడా ఏలియన్స్ ఇక్కడే భూమి మీద ఉన్నరంటూ నమ్మకంగా చెబుతున్నారు.

New Update
usa

Aliens

మనుషులు కాదు..భూమి మీద ఉండరు...ఏదో గ్రహం మీద నుంచి వస్తారు..చూడ్డానికి వింతగా ఉంటారు..వీళ్ళనే గ్రహాంతరవాసులంటారు. వీళ్ళు ఉన్నారని ఒకరు..లేదూ అవన్నీ అభూత కల్పనలే అని మరొకరు...మేము చూశామని కొందరు..లేదు అలాంటివేమీ లేవని మరి కొందరు...ఇలా ఎన్నో కథనాలు. వీటి మీద వచ్చిన సినిమాలు కూడా ఎన్నో. ఇప్పుడు గ్రహాంతరవాసుల మీదనే మరో వార్త వెలుగలోకి వచ్చింది. భూమిపై ఏలియన్స్ ఉన్నాయంటున్నారు. అమెరికా మిలటరీ, నిఘా అధికారులు. గ్రహాంతర వాసుల మీద ఓ డాక్యుమెంటరీ రూపొందించగా...అందులో 34 మంది అమెరికా మిలటరీ, నిఘా అధికారులు తాము యూఎఫ్ వోలను, ఏలియన్స్ చూశామని నమ్మకంగా చెప్పారు. 

ఇక్కడే ఉన్నాయి..

గ్రహాంతర వాసులు భూమి మీదనే ఉంటున్నారు అని చెబుతున్నారు అమెరికా మిలటరీ అధికారులు. ది ఏజ్‌ ఆఫ్‌ డిస్‌క్లోజర్‌’ పేరుతో కొత్తగా విడుదలైన ఓ డాక్యుమెంటరీలో విశ్వంలో మనతో పాటు మరో గ్రహంలోనూ జీవుల ఉనికి ఉందని చెప్పారు.  వేరే గ్రహాల నుంచి అంతరిక్ష నౌకలు భూమి మీదకు వచ్చాయని...ఇక్కడే ఎక్కడో ఉన్నాయని చెప్పారు. మొత్తం 34 మంది అమెరికా మిలటరీ, నిఘా అధికారులు దీన్ని ధృవీకరించారు. వాటి గురించి తమకు స్పష్టంగా తెలుసనని...కొంత మంది తాము చూశామని కూడా చెప్పారు. వీళ్ళందరూ వెటరన్ అధికారులు. భూమి మీద మనుషులు టెక్నాలజీలో ఎంత అభివృద్ధి చెందారో చూడ్డానికి, పరిశీలించడానికి అంతరిక్షల నౌకలు వస్తున్నాయని తెలిపారు. ఇది ఇప్పటిది కాదని...1940 నుంచి ఏలియన్స్ నేల మీదకు వస్తున్నాయని వివరించారు. అమెరికా ప్రభుత్వానికి ఈ విషయం తెలిసినా కావాలనే గోప్యత పాటిస్తోందని చెప్పారు. 

ఏమీ లేవు..అవన్నీ అపోహలే..

గ్రహాంతర వాసుల వల్ల అమెరికా భద్రతకు ముప్పు ఉందని కూడా వెటరన్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏలియన్స్ వచ్చే యూఎఫ్ వో ల వేగం..మన ఎయిర్ క్రాఫ్ట్ లకన్నా 10 రెట్లు ఎక్కువ ఉంటుందని చెప్పారు. వాటి వేగం గంటకు 50 వేల మైళ్లు దాటి ఉంటుందని వారు వెల్లడించారు. అయితే వెటరన్స్ చెప్పిన విషయాలను సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మార్కో రూబియో, న్యూయార్క్‌ సెనేటర్‌ కిర్‌స్టెన్‌ గిల్లిబ్రాండ్‌ కొట్టిపడేశారు. యూఏపీలు ఖండాంతర ప్రయోగాలకు సంబంధించినవి కావచ్చని గిల్లిబ్రాండ్‌ అన్నారు. చైనా, రష్యా లేదా వేరే శత్రుదేశాలకు చెందినవి అయ్యిండవచ్చని అన్నారు. 

Also Read: TS: తెలుగు యూనివర్శిటీకి సురవరం పేరు! 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు