South Central Railway : మరో పది రోజుల్లో వేసవి సెలవులు(Summer Holidays) రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు నెలల ముందు నుంచే రైళ్ల టికెట్ల(Train Tickets) న్ని కూడా బుక్ అయిపోయాయి. ఇంకా టికెట్ల కోసం ప్రయాణికులు ప్రయత్నిస్తుండడంతో రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే(SCR) వేసవి ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయించింది.
సికింద్రాబాద్(Secunderabad) నుంచి పశ్చిమ బెంగాల్(West Bengal) లోని షాలిమార్, సాంత్రాగాఛిలకు... కేరళ(Kerala) లోని కొల్లంకు స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి సాంత్రాగాఛి రైలు ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
ఈ రైలు ఏప్రిల్ 19 నుంచి జూన్ 28 వరకు రెండు నెలల పాటు 11 ట్రిప్పులు నడవనుందని సమాచారం. తిరిగి శనివారం సాంత్రాగాఛి నుంచి సికింద్రాబాద్ కు ప్రయాణం అవుతుంది. ఈ ప్రత్యే క రైలు ఏప్రిల్ 20 నుంచి జూన్ 29 వరకు 11 ట్రిప్పులు ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా అధికారులు నిర్ణయించారు.
రాష్ట్రంలో నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయని రైల్వే అధికారులు వివరించారు. గుంటూరు, విజయవాడ, దువ్వాడ, విజయనగరం, భువనేశ్వర్, కటక్, ఖరగ్‌పూర్ మీదగా ఈ రైలు నడుస్తుందని అధికారులు వివరించారు.
సికింద్రాబాద్- షాలిమార్ ప్రత్యేక రైలు ఏప్రిల్ 15 నుంచి జూన్ 24 వరకు ప్రతి సోమవారం షాలిమార్- సికింద్రాబాద్ రైలు ఏప్రిల్ 16 నుంచి జూన్ 25 వరకు ప్రతి మంగళవారం బయల్దేరతాయని అధికారులు వివరించారు.
ఈ రైళ్లు కూడా రెండు నెలల పాటు 11 ట్రిప్పులు తిరుగుతాయని , కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం స్టేషన్లలో ఆగుతాయి. రాయనపాడు, రాజమండ్రి, దువ్వాడ, భువనేశ్వర్, ఖరగ్‌పూర్, సాంత్రాగాఛి మీదుగా రైలు రాకపోకలు సాగిస్తుంది.
సికింద్రాబాద్ కొల్లం మధ్య రానుపోను 22 ట్రిప్పుల ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ కొల్లం మధ్య నడిచే ప్రత్యేక రైలు ఏప్రిల్ 17, 24, మే 1, 8, 15, 22, 29 జూన్ 5, 12, 19, 26 తేదీల్లో బయల్దేరుతుందని అధికారులు వివరించారు.
Also read: శరీరానికి కొబ్బరి నీళ్లు మాత్రమే కాదు.. లేత కొబ్బరి కూడా మేలే!