Srisailam : మహాశివరాత్రి(Maha Shivaratri) పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం(Srisailam) పుణ్య క్షేత్రాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు అధికారులు. ఈ క్రమంలోనే తెలంగాణ ఆర్టీసీ(TSRTC) ఓ గుడ్ న్యూస్ తెలిపింది. మరో వారం రోజుల్లో శివరాత్రి పండుగ ఉండగా.. ఇప్పటి నుంచే ఆలయానికి భక్తులు భారీగా చేరుకుంటున్నారు.
ఈ క్రమంలో టీఎస్ ఆర్టీసీ హైదరాబాద్(Hyderabad) నుంచి శ్రీశైలానికి బస్సులు నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ శ్రీధర్ ప్రకటించారు. ఈ బస్సులను హైదరాబాద్ లోని బీహెచ్‌ఈఎల్, జూబ్లీ స్టేషన్, ఎంజీబీఎస్ నుంచి శ్రీశైలం బస్సులు ఉదయం 5 గంటల నుంచి మొదలై మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రతి గంటకు ఓ బస్సును నడుపుతున్నట్లు వివరించారు.
అలాగే శ్రీశైలం లో కూడా ఉదయం 5 గంటల నుంచి బస్సు సర్వీసులు నడపనున్నట్లు అధికారులు వివరించగా.. ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రతి గంటకు బస్సులు బయల్దేరతాయని తెలిపారు. ఏసీ బస్సులు, ఆర్డీనరి బస్సులను , సూపర్ లగ్జరీ బస్సులను నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఈ ఏసీ బస్సు సర్వీసుల్లో పెద్దలకు రూ. 650, పిల్లలకు రూ. 510 ఛార్జీలుంటాయని తెలిపారు. శివరాత్రికి హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
Also Read : అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు వేరుశెనగ తినవచ్చా?