DK Aruna: స్పీకర్ తన కాల్‌ను లిఫ్ట్‌ చేయడం లేదు

హైకోర్టు ఆర్డర్‌ కాపీతో డీకే అరుణ అసెంబ్లీకి వెళ్లారు. అక్కడ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, అసెంబ్లీ సెక్రటరీ అందుబాటులో లేకపోవడంతో హైకోర్టు ఆర్డర్‌ కాపీని ఆమె అసెంబ్లీ సిబ్బందికి ఇచ్చినట్లు తెలిపారు. స్పీకర్‌ వెంటనే హైకోర్టు ఆర్డర్‌ కాపీని ఇంప్లిమెంట్‌ చేయాలని డీకే అరుణ కోరారు.

New Update
DK Aruna: స్పీకర్ తన కాల్‌ను లిఫ్ట్‌ చేయడం లేదు

DK Aruna: స్పీకర్‌ తన కాల్‌ లిఫ్ట్‌ చేయడం లేదని మాజీ మంత్రి డీకే అరుణ తెలిపారు. తనను హైకోర్టు ఎమ్మెల్యేగా ప్రకటించినట్లు గుర్తు చేశారు. హైకోర్టు అందించిన ఆర్టర్‌ కాపీని అందించేందుకు ఎమ్మెల్యే రఘుననందన్‌ రావుతో కలిసి డీకే అరుణ అసెంబ్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి (Pocharam Srinivas Reddy) గురువారం సాయంత్రం, ఇవాళ ఉదయం కాల్‌ చేసినట్లు తెలిపారు. స్పీకర్‌ తన కాల్‌ను లిఫ్ట్‌ చేయడం లేదని వెల్లడించారు. స్పీకర్‌తో పాటు అసెంబ్లీ సెక్రటరీ సైతం అందుబాటులో లేరని డీకే అరుణ వివరించారు. కాగా ప్రస్తుతం హైకోర్టు ఆర్డర్‌ కాపీని ఆఫీస్‌ స్టాప్‌కు ఇచ్చినట్లు స్పష్టం చేశారు.

ఈ తీర్పు నాలుగేళ్ల క్రితమే వచ్చి ఉంటే గద్వాల నియోజకవర్గం అభివృద్ధి చెంది ఉండేదని డీకే అరుణ అన్నారు. అసెంబ్లీ స్పీకర్‌ తన అధికారాలను ఉపయోగించి వెంటనే హైకోర్టు ఆర్డర్‌ను ఇంప్లిమెంట్‌ చేయాలని డీకే అరుణ విజ్ఞప్తి చేశారు. హైకోర్టు తీర్పును గౌరవించాలన్న అరుణ.. స్పీకర్‌ వెంటనే దీనిని ఇంప్లిమెంట్‌ చేయాలని ఆమె కోరారు.

గద్వాల ఎమ్మెల్యేగా ఉన్న బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి 2018 ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ లో తప్పుడు వివరాలు సమర్పించారని డీకే అరుణ అప్పట్లో కోర్టులో కేసు వేశారు. దీనిపై అపటి నుంచి కోర్టులో విచారణ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో హైకోర్టు ఎమ్మెల్యే పై అనర్హత వేటు వేసింది. దీంతో సెకండ్ ప్లేస్ లో ఉన్న డీకే అరుణను ఎమ్మెల్యేగా ధర్మాసనం ప్రకటించింది. అంతే కాదు తప్పుడు వివరాలు సమర్పించినందుకు కృష్ణ మోహన్ రెడ్డికి 3 లక్షల జరిమానా కూడా విధించింది కోర్టు. అందులో నుంచి 50 వేలు డీకే అరుణకు ఇవ్వాలని ఆదేశాలిచ్చింది.

అయితే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గద్వాల నియోజకవర్గం నుంచి ఈ సారి కూడా బీఆర్ఎస్ అభ్యర్థిగా కృష్ణమోహన్ రెడ్డినే ప్రకటించింది. మరి ఈ నేపథ్యంలో ఆయన అనర్హత వేటు పై హైకోర్టు వేటు వేయడం గమనార్హం. మరి ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. అయితే వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుండడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. వనమా వెంకటేశ్వర్లు ఇంకా శ్రీనివాస్ గౌడ్ ఎంపిక కూడా వివాదంగా మారింది.

Also Read: పాలేరు వార్.. షర్మిల, తుమ్మలలో ఈ సీటు ఎవరికి దక్కనుంది?

Advertisment
Advertisment
తాజా కథనాలు