North Korea: కష్టాల్లో ఉత్తర కొరియా.. సాయం చేస్తామన్న దక్షిణ కొరియా

ఉత్తర కొరియాలో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తుండంతో వరదలు పోటెత్తాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులను ఆదుకునేందుకు సహాయ సామగ్రిని అందజేస్తామని ప్రకటన చేసింది. అయితే దీనిపై ఇంకా కిమ్ ప్రభుత్వం స్పందించలేదు.

New Update
North Korea: కష్టాల్లో ఉత్తర కొరియా.. సాయం చేస్తామన్న దక్షిణ కొరియా

ఉత్తర కొరియాలో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో అక్కడ వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కష్టాల్లో ఉన్న ఉత్తర కొరియాకు సాయం చేస్తామంటూ దక్షిణ కొరియా ముందుకొచ్చింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులను ఆదుకునేందుకు సహాయ సామగ్రిని అందజేస్తామని ప్రకటన చేసింది. వీటిని ఎలా సరఫరా చేయాలనే దానిపై చర్చించడానికి నార్త్ కొరియా రెడ్‌ క్రాస్‌ సంస్థ స్పందించాలని కోరింది. అయితే దక్షిణ కొరియా ప్రకటించిన ఆఫర్‌పై ఇంకా కిమ్‌ ప్రభుత్వం స్పందించలేదు.

Also Read:  హమాస్‌ మాస్టర్‌ మైండ్ మహమ్మద్‌ డెయిఫ్‌ హతం!

Advertisment
తాజా కథనాలు