T20 World Cup: సూపర్ 8లో మొదటి విజయం..అమెరికా మీద గెలిచిన సౌత్ ఆఫ్రికా

టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్ 8 పోరు మొదలయిపోయింది. మొదటి మ్యాచ్‌ సౌత్ ఆఫ్రికా, అమెరికాల మధ్య జరిగింది. ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా గెలిచింది. కానీ అమెరికా కూడా ఎక్కడా తగ్గకుండా ఆడింది. తమను ఓడించడం అంత ఈజీ కాదని హెచ్చరించింది.

New Update
T20 World Cup: సూపర్ 8లో మొదటి విజయం..అమెరికా మీద గెలిచిన సౌత్ ఆఫ్రికా

America Vs Soth Africa: టీ20 ప్రపంచకప్‌లో సూపర్-8 పోరులో భాగంగా అమెరికా మీద దక్షిణాఫ్రికా 18 పరుగుల తేడాతో నెగ్గింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 194 పరుగుల చేసింది. జట్టు ఓపెనర్‌ డికాక్‌ 40 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 74 పరుగులు చేయగా.. కెప్టెన్‌ మార్‌క్రమ్‌ 32 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 46 పరుగులు, క్లాసెన్‌ 22 బంతుల్లో 3 సెక్స్‌లు కొట్టి 36 పరుగులు, స్టబ్స్‌ 16 బంతుల్లో 2 ఫోర్లతో 26 పరుగులు చేశారు. అమెరికా బౌలర్లలో నేత్రావల్కర్‌, హర్మీత్‌ సింగ్‌ రెండు వికెట్లు పడగొట్టారు.

తర్వాత 195 పరుగుల తేడాతో అమెరికా బ్యాటింగ్‌కు దిగింది. 2౦ ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఒకానొక దశలో అమెరికా టీమ్ కచ్చితంగా మ్యాచ్ గెలుస్తుందనే అనుకున్నారు అందరూ. జట్టులో ఓపెనర్‌ ఆండ్రిస్‌ గౌస్‌ (80*: 47 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగినప్పటికీ చివరలో తడబడడంతో ఆజట్టు ఓటమిపాలైంది. హర్మీత్‌ సింగ్‌ (38), స్టీవెన్‌ టైలర్‌ (24) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ మూడు వికెట్లు తీయగా, కేశవ్‌ మహరాజ్‌, అన్‌రిచ్‌, తబ్రేజ్‌ షంసీ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దు ..

ఇదీ అమెరికా చెప్తోంది. సౌత్ ఆఫ్రికా భారీ లక్ష్యం ఇచ్చింది. ఆ టీమ్ బౌలర్లు కూడా ఏమీ తక్కువ కాదు. అయినా కూడా అమెరికా జట్టు ఏ మాత్రం భయపడలేదు. ఎక్కడా తడబడలేదు. ఓపెనర్ ఆండ్రిస్ సౌత్ ఆఫ్రికా బౌలర్ల మీద విరుచుకుపడ్డాడు. వికెట్లు పడుతున్నా తాను మాత్రం గ్రౌండ్‌కే స్టిక్ అయిపోయాయడు. మిగతా బ్యాటర్లు కూడా బాగానే ఆడారు. మరికాస్త నిలకడగా ఆడి ఉంటే మ్యాచ్ తప్పకుండా గెలిచే వారు. 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 73 పరుగులతో నిలిచిన ఆజట్టు.. ఆతర్వాత మెల్లిగా తమ బ్యాటకు పదును పెట్టారు. నోకియా వేసిన 15వ ఓవర్లో అయితే గౌస్‌ విశ్వరూపం చూపించాడు. ఒక ఫోర్‌, రెండు సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. ఇక ఆ జట్టుకు చివరి 4 ఓవర్లలో 60 పరుగులు అవసరం కాగా, తొలి రెండు ఓవర్లలో 32 పరుగులు చేశారు.

Also Read:Andhra Pradesh: ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు

Advertisment
తాజా కథనాలు