Karnataka : ఆస్తి కోసం తండ్రిని చచ్చేలా కొట్టిన కొడుకు..నాన్న మృతి

ఆస్తి కోసం కన్న తండ్రులను కొట్టి చంపుతున్న కొడుకులకు మనదేశంలో కొదవేమీ లేదు. కానీ అలాంటి సంఘటనల వీడియోలు మాత్రం పెద్దగా బయటకు రావు. అయితే తాజాగా కర్ణాటకలో ఓ తండ్రిని విచక్షణారహితంగా కొట్టి అతని చావుకు కారణమైన కొడుకు వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
Karnataka : ఆస్తి కోసం తండ్రిని చచ్చేలా కొట్టిన కొడుకు..నాన్న మృతి

Son Attacked On Father For Property : కన్నతండ్రి.. చిన్నప్పటి నుంచి భుజాల మీద మోసి పెంచిన నాన్న. చిన్నప్పుడు కాలితే తంతే మురిసిపోయాడు. కానీ అదే కొడుకు పెద్దయ్యాక చచ్చేలా కొడితే... ఏం చేయలేక శాశ్వతంగా కన్నమూసాడు. కర్ణాటక(Karnataka) లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media) లో తెగ వైరల్ అవుతోంది. ఆస్తి ఇవ్వలేదనే కోపంతో తండ్రిని చావ చితక్కొట్టాడు కొడుకు. కుర్చీలో కూర్చున్న నాన్నపై విచక్షణారహితంగా పిడిగుద్దులు కురించాడు. కాలి మోకాలితో బలంగా మొహం మీద గుద్దాడు. దీంతో విలవిలలాడిపోయిన ఆ తండ్రి అక్కడే పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేశారు.

కొడుకు కొట్టిన దెబ్బలను శరీరం తట్టుకుంది. కానీ తండ్రి మనసు మాత్రం తట్టుకోలేక పోయింది. సంఘటన జరిగిన తర్వాత రెండు నెలలు పాటూ ఆసుపత్రిలో ఉన్న తండ్రి చివరకు గుండెపోటు(Heart Attack) తో మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. గత ఏప్రిల్ 25న కొడుకును అరెస్ట్ చేశారు.  పెరంబలూరుకు చెందిన అమృత సాగో ఇండస్ట్రీస్ యజమాని కులంతైవేలు (63)పై ఆయన కుమారుడు సంతోష్ (40) ఆస్తి కోసం దాడిచేశాడు. ఈ ఘటన ఫిబ్రవరిలో జరిగింది. రెండు నెలలుగా కులంఐవేలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈయన ఏప్రిల్ 18న చనిపోయారు. కొడుకు కొట్టిన దెబ్బలకు తండ్రికి తీవ్రగాయాలయ్యాయి. దాంతో పాటూ దీనికి సంబంధించిన సీసీ టీశీ ఫుటేజ్ కూడా బయటపడింది. ఇందులో కొడుకు ఎంత దారుణంగా తండ్రిని కొట్టాడో స్పష్టంగా కనిపిస్తోంది. దీని ఆధారంగా కొడుకు సంతోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతని మీద కుటుంబ సభ్యులు మాత్రం ఎటువంటి ఫిర్యాదును ఇవ్వలేదు.

అయితే కులంతైవేలు గతంలోనే కొడుకు సంతోష్ మీద కంప్లైంట్ ఇచ్చి వెనక్కు తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన గుండెపోటుతో మరణించినట్టు ప్రాథమిక నిర్ధారణ అయింది. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత స్పష్టత వస్తుంది పోలీసులుచెబుతున్నారు. దీని మీద దర్యాప్తు చేస్తుననామని చెప్పారు.

Also Read:Karnataka : మాజీ ప్రధాని మనవడిపై లైంగిక వేధింపుల కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు

Advertisment
తాజా కథనాలు