Healthy Diet : ఈ రెండు పదార్థాలను బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకోండి.. మీరు ఫాస్ట్‌గా దూసుకెళ్తారు! అరటి, నానబెట్టిన వేరుశెనగ తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ రెండిటిని బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకుంటే ఎంతో బెస్ట్. నానబెట్టిన వేరుశెనగ తినడం జీర్ణక్రియలో సహాయపడుతుంది. రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. By Vijaya Nimma 21 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Banana & Peanut : మీరు అల్పాహారంగా ఆరోగ్యకరమైన ఆహారం తినాలనుకుంటే.. ఈ రెండు పదార్తాలతో రోజు ప్రారంభించండి. ఇందులో అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి. అరటి(Banana), నానబెట్టిన వేరుశెనగ(Peanut) తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఎవరైనా తమ సాత్విక ఆహారాన్ని అనుసరించడం ద్వారా సులభంగా ఆరోగ్యంగా ఉండగలరు. ఈ రెండు పదార్థాలు అన్ని పోషకాలను కలిగి ఉండటమే కాకుండా శరీరానికి పూర్తిగా మేలు చేస్తాయి. కాబట్టి ఆరోగ్యంగా, చురుకుగా ఉంచడంలో సహాయపడిన ఆ రెండు ఆహారాలు ఏవో తెలుసుకుందాం. ఈ రెండిటితో రోజంతా శక్తి పాత రోజుల్లో తడి వేరుశెనగ, అరటిపండు మాత్రమే తింటూ రోజంతా కొందరూ గడిపుతారు. అలాగే.. రోజంతా చురుగ్గా, శక్తితో ఉండాలంటే తడి వేరుశెనగ, అరటిపండ్లు ఏ వ్యక్తి అయినా ఆరోగ్యంగా ఉండేందుకు కావలసినంత పోషకాలను కలిగి ఉంటాయి. నానబెట్టిన వేరుశెనగలు.. శెనగలని నానబెట్టిన తర్వాత వాటిని తింటే దానిలోని పిత్తం తొలగిపోతుంది. అప్పుడు..దానిని పూర్తిగా నమలడం ద్వారా మీకు అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి. వేరుశెనగలో పోషకాలు: 100 గ్రాముల వేరుశెనగలో 25.8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది రోజువారీ ప్రోటీన్ అవసరాలలో 50 శాతం తీర్చగలదు. అంతేకాకుండా వేరుశెనగలో ఫైబర్, పొటాషియం, ఫాస్పరస్, లిపిడ్, విటమిన్లు, మెగ్నీషియం, సెలీనియం, ఐరన్, జింక్, కాల్షియం, కాపర్ ఉన్నాయి. వేరుశెనగను నానబెట్టినట్లయితే.. అది పోషక విలువలను పెంచుతుంది. వీటిని తింటే ఎముకల సాంద్రత, చర్మం , జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది నానబెట్టిన వేరుశెనగ తినడం వలన తగినంత మొత్తంలో ఫైబర్ కూడా లభిస్తుంది. దీని వల్ల జీర్ణక్రియలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యం నానబెట్టిన వేరుశెనగ తింటే రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండెను రక్షిస్తుంది. దీనివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం దీర్ఘకాలంలో తగ్గుతుంది. జీవక్రియ వ్యవస్థ వేగవంతం అవుతుంది. వేరుశెనగలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ఏర్పడకుండా నిరోధిస్తాయి. దీనివల్ల శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగవు. గ్యాస్, అసిడిటీని తగ్గించడంతో పాటు జ్ఞాపకశక్తి. కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇది కూడా చదవండి: లవంగాలు తింటే పురుషుల్లో ఆ సామర్థ్యం పెరుగుందట.. ఏ టైంలో తినాలంటే..!! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #health-benefits #breakfast #healthy-diet #energy #soaked-peanuts #bananas మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి