Mobile Phones: మన ఫోన్ మనల్ని స్పై చేస్తోంది..షాకింగ్ నిజాలు మన ఫోన్ మనల్ని ట్రాక్ చేస్తోందా..మనం మాట్లాడుకునేవి దానికి వినిపిస్తున్నాయా...అవి అన్నీ వేరే వారికి చేరుతున్నాయా..అంటే అవుననే అంటున్నారు. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామో...దానికి సంబంధించిన యాడ్స్ ఫోన్‌లో వస్తున్నాయి కాబట్టి..ఇది నిజమేనని తెలుస్తోంది. By Manogna alamuru 04 Sep 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Phones Spying: ఫోన్లు...వాటి టెక్నాలజీ మీద తాజాగా ఒక నివేదిక వెలువడింది. దీన్ని బట్టి ఫోన్లు మన మాటలు వింటున్నాయని తేలింది. ఇందుకు ఉదాహరణే మనం ఏ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుంటామో..దాని తాలూకా అడ్వర్టైజ్‌మెంట్ మన ఫోన్‌లో కనిపించడం అని చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్లు..తనలో ఉండే మైక్రోఫోన్లు ద్వారా మ సంభాషణలను గుర్తించి...డేటా సేకరించి, అనుమతించే సాంకేతికతను కలిగి ఉంటున్నాయి. Google, Meta వంటి క్లయింట్‌లను కలిగి ఉన్న మార్కెటింగ్ కంపెనీల ద్వారా యాక్టివ్ లిజనింగ్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించబడుతోంది. సేకరించబడిన డేటాకు తగినట్లుగా ప్రకటనలను పంపడం వీటి లక్ష్యంగా మారింది. 404 మీడియా తాజా నివేదికలో దీని గురించి వివరించబడింది. 404 నివేదిక ప్రకారం, కాక్స్ మీడియా గ్రూప్ యొక్క ప్రముఖ మీడియా ప్లేయర్ సంభాషణలను ట్రాక్ చేయడానికి మరియు పర్యవేక్షించడానికి AI- ఇంధనంతో కూడిన యాక్టివ్ లిజనింగ్ సాఫ్ట్‌వేర్‌ను అమలు చేస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్ 470కి పైగా మూలాల నుండి డేటాను లాగుతోంది. వినియోగదారుల ఆన్‌లైన్ యాక్టివిటీని గమనించి దానికి తగ్గట్టు బలమైన ప్రోఫైల్‌ను సృష్టిస్తోంది. దీని ద్వారా కంపెనీలు తమ యాడ్స్‌ను ప్రమోట్ చేసుకుంటున్నాయి. ప్రస్తుతం 404 మీడియా తాజా నివేదిక టెక్ ప్రపంచంలో సంచలనంగా మారింది. దీంతో పెద్ద పెద్ద టెక్ కంపెనీలు అన్నీ తమను తాము చెక్ చేసుకోవడం మొదలెట్టాయి. అమెజాన్ ఇప్పటికే సెల్ఫ్ చెక్ చేసుకుని తాము ఇలాంటి టెక్నాలజీకి దూరంగా ఉన్నామని స్పష్టం చేసింది. మెటా కూడా తమ సేవా నిబంధనల మీద విచారణ ప్రారంభించింది. మరోవైపు మీడియా కాక్స్ గ్రూప్ మాత్రం ఈ డేటా సేకరణను సమర్ధిస్తోంది. వినియోగదారులు యాప్‌లను డౌన్‌లో, అప్‌లోడ్ చేసే సమయంలో సర్వీస్ నిబంధనల ద్వారా యాక్టివ్ లిజనింగ్ టెక్నాలజీకి వినియోగదారులు తెలియకుండానే అంగీకరిస్తారని వాదిస్తున్నారు. అయితే కేవలం ఇది విజువల్ మీడియాకు మాత్రమే పరిమితమైంది. ప్రింట్ లోకి వచ్చేసరికి ఇలా ఉండటం లేదు. వినియోగదారుల డేటాను ఫోన్లు సేకరించడంపై ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది. ఇలా అయితే గోప్యత అనే అంశమే ఉండదని...అందరి జీవితాలు బహిర్గతంఅయిపోతాయనే ఆందోళన మొదలైంది. దీంతో కంపెనీలో పారదర్శక డేటా పద్దతులను పాటించాలని అంటూ ఆందోళన పెరిగింది. దీని కోసం ప్రపంచంలో చాలా ప్రభుత్వాలు సైతం డేటా గోప్యతా చట్టాల మీద ఉక్కుపాదాలు మోపుతున్నాయి. డిజిటల్ హక్కులు మరియు వినియోగదారుల రక్షణల ల్యాండ్‌స్కేప్‌ను పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చే సమగ్ర డేటా గోప్యతా బిల్లుపై అమెరికా చట్టసభ సభ్యులు ద్వైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీని ప్రకారం సాంకేతిక సంస్థలచే వ్యక్తిగత డేటా సేకరణ, వినియోగాన్ని పరిమితం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. #technology #mobile-phones #data #spying మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి