Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరం వీడియో విడుదల.. ఓ లుక్కేయండి

యూపీలోని అయోధ్యలో వచ్చే ఏడాది జనవరి 22న దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి రామ మందిరాన్ని ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు ఆలయ ప్రారంభోత్సవానికి హాజరు కావాలంటూ ప్రధాని మోదీకి ఇటీవల ఆహ్వానం కూడా పలికారు. అయితే ఇప్పుడు తాజాగా రామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్ రామ మందిరానికి సంబంధించి ఓ వీడియోను విడుదల చేసింది.

author-image
By B Aravind
New Update
Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరం వీడియో విడుదల.. ఓ లుక్కేయండి

ఉత్తరప్రదేశ్‌లో అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రామ మందిర నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ పనులు ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయి. ఇక రామమందిరం ప్రారంభోత్సవం తేదీ కూడా ఖరారైపోయింది. వచ్చే ఏడాది జనవరి 22న దేవతామార్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి ఆలయాన్ని ప్రారంభించనున్నారు. అలాగే ఈ ఆలయ ప్రారంభోత్సవానికి రావాలంటూ ప్రధాని మోదీని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు కలిసి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ కూడా వారి ఆహ్వానాన్ని ఆనందంగా అంగీకరించారు.

Also Read: ఐటీ ఉద్యోగం కోసం చూస్తున్నారా.. ఇక అంతే సంగతులు

ఇదిలా ఉండగా.. శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌ తాజాగా రామమందిరం వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 500 ఏళ్ల పోరాటానికి ముగింపు అంటూ కామెంట్ చేసింది. ఇక ఈ వీడియోను గమనిస్తే.. అందులో రామ మందిరానికి శిల్పకారులు తుదిమెరుగులు దిద్దడం కనిపిస్తుంది. అయోధ్య పిలస్తోంది అనే బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో వచ్చిన ఈ వీడియోలో ఆలయంలో ఉన్న ద్వారాలు, గోపురం, పిల్లర్లు, ఫ్లోరింగ్‌తో సహా.. మందిర నిర్మాణానికి వినియోగించిన భారీ యంత్రాలను చూడవచ్చు. ఇక మరో ఫ్రెమ్‌లో చూస్తే.. శిల్పకారులు దేవతా మూర్తుల విగ్రహాలను చెక్కుతుండటం చూడొచ్చు. రామమందిరంలోని దేవతామూర్తుల విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమానికి దాదాపు 4వేల మంది సాధువులు, 2500 మంది ప్రముఖులు హాజరుకానున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ ట్రస్ట్ పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి.

Advertisment
Advertisment
తాజా కథనాలు