Ram Mandir Inauguration: అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి తేదీ ఖరారు.. ప్రధాని మోదీకీ ఆహ్వానం..
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి తేది ఖరారైంది. దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి వచ్చే ఏడాది జనవరి 22న రామమందిరాన్ని ప్రారంభించాలని ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఆహ్వానం పలికారు. వారి ఆహ్వానాన్ని స్వీకరించిన ప్రధాని.. నా జీవితకాలంలో ఈ చారిత్రాత్మక సందర్భాన్ని చూడటం నా అదృష్టమని ఎక్స్‌లో పేర్కొన్నారు.