Trump Tariffs: డాలర్ తో పెట్టుకోకండి..బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్

బ్రిక్స్ దేశాలకు అమెరికా అధ్యక్షుడు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఆ దేశాలు డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తే 10 శాతం అదనపు సుంకాలు ఎదుర్కోవలసి వస్తుందని బెదిరించారు. డాలర్ ఆధిపత్యం ఎప్పటికీ కొనసాగాల్సిందేనని తెగేసి చెప్పారు.

New Update
Donald Trump

Donald Trump

ప్రతీకార సుంకాలను అడ్డం పెట్టుకుని అమెరికా అధ్యక్షుడు అందరినీ బెదిరిస్తున్నారు. యుద్ధాలకూ అదే...సామరస్యానికీ అదే ఆయుధం కింద వాడేస్తున్నారు. ఏది ఏమైనా సుంకాల విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ఆగస్టు 1 నుంచి అన్ని దేశాలకు సుంకాలు తప్పనిసరి అని చెబుతూ పనిలో పని మరోసారి బ్రిక్స్ దేశాల మీద విరుచుకుపడ్డారు ట్రంప్. అదో చిన్న గ్రూప్ అంటూ విమర్శించారు. వాళ్ళు తమనేమీ చేయలేరంటూనే...డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తే మాత్రం ఊరుకోమని హెచ్చరించారు. ఆ దేశాలకు 10శాతం అదనపు సుంకాలను ఎదుర్కోవలసి ఉంటుందని స్పష్టం చేశారు. 

అబ్బే అది ఎన్నో రోజులు ఉండదు..

క్రిప్టో కరెన్సీ చట్టబద్ధతకు సంబంధించిన ‘జీనియస్‌’ బిల్లుపై సంతకం చేసిన ట్రంప్‌ తరువాత మీడియా సమావేశంలో మాట్లాడారు. అప్పుడు పై వ్యాఖ్యలను చేశారు. బ్రిక్స్ దేశాల గ్రూప్ చాలా వేగంగా తన ఉనికి కోల్పోతుందని అన్నారు. వారిని తాము చాలా బలంగా కొట్టామని చెప్పుకొచ్చారు. అమెరికా డాలర్ కు గ్లోబల్ రిజర్వ్ హోదా ఉందని...దాంతో ఆటలు వద్దని వార్నింగ్ ఇచ్చారు. డాలర్ విలువ తగ్గడాన్ని ఎప్పటికీ అంగీకరించమని చెప్పారు. మా కరెన్సీ స్టేటస్‌ పడిపోతే.. దాన్ని మేం ఓటమిగానే భావిస్తామని ట్రంప్‌ స్పష్టం చేశారు. 

రీసెంట్ గా జరిగిన బ్రిక్స్ దేశాల సదస్సులో సుంకాల విషయమై ఆ దేశాధ్యక్షులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ట్రప్ అప్పుడే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే బ్రిక్స దేశాలపై 10 శాతం అదనపు పన్నులు ఉంటాయని చెప్పారు. ఇప్పుడు అదే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు అమెరికా అధ్యక్షుడు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో కలిసి బ్రిక్స్‌ కూటమి ఏర్పడింది. ఆ తర్వాత అందులో ఇరాన్, ఇథియోపియా, ఈజిప్ట్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, ఇండోనేసియా కూడా చేరడంతో ఇప్పుడు ఆ గ్రూప్ ను బ్రిక్స్ ప్లస్ గా వ్యవహరిస్తున్నారు. 

Also Read: Pakistan: భారత్ కు గగనతల నిషేధాన్ని పొడిగించిన పాకిస్తాన్

Advertisment
Advertisment
తాజా కథనాలు