Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై ఆశలు.. అడియాశలే? ఇందిరమ్మ ఇళ్ల కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న వారికి నిరాశే. ఈ ఏడాదికి 4 లక్షల 16వేల 500 ఇళ్లు నిర్మించాలని కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకుంది. ఇళ్ల కోసం 82 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. వారందరికీ ఇళ్లు రావాలంటే కనీసం పదేళ్లు పడుతుందని అంచనా వేశారు అధికారులు. By V.J Reddy 11 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి భారీ షాక్ తగలనునట్లు తెలుస్తోంది. ఇటీవల తెలంగాణలో కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఎన్నికల సమాయంతో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా ఇచ్చిన ఆరు గ్యారెంటీల (Congress Six Guarantees) కొరకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అయితే.. ప్రభుత్వం ప్రాధాన్యత తీసుకున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఆరు గ్యారెంటీల పతకాల కొరకు ప్రజలు నుంచి దరఖాస్తులు భారీగా వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. Also Read: ఎన్నికల వేళ ఏపీలో ఆ నేతలకు కీలక బాధ్యతలు.. ! ఇళ్లు 4 లక్షలు.. దరఖాస్తులు 82 లక్షలు? ప్రజాపాలన కార్యక్రమంలో ఎక్కువ దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్ల కోసమే వచ్చాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. దాదాపు ఇందిరమ్మ ఇళ్ల కోసం 82 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే.. మొత్తం ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే అధికారిక ప్రకటన రాలేదు. 82 లక్షల దరఖాస్తులు అనేది అంచనా మాత్రమే. ఇదిలా ఉండగా.. ఈ ఏడాదికి 4 లక్షల 16వేల 500 ఇళ్లు నిర్మించాలని కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ పెట్టుకుంది. ప్రతి నియోజకవర్గంలో 3, 500 ఇళ్లు నిర్మిస్తామని అసెంబ్లీ లోప్రభుత్వం ప్రకటించింది. 82 లక్షల మందిలో కనీసం 50 లక్షల మంది అర్హులు అనుకుంటే.. ఏడాదికి 5 లక్షల ఇళ్లు నిర్మించినా పదేళ్లు పట్టే అవకాశం ఉందని అంచనా. ఐదేళ్లలోనే లబ్ధిదారులందరికీ ఇళ్లు అసాధ్యం అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 82లక్షల దరఖాస్తుల్లో ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు ఎవరు?, లబ్ధి దారుల ఎంపిక ఎలా ఉండబోతోంది?, నియోజకవర్గంలో 3,500 మందిని ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు? ఇలా ఇందిరమ్మ ఇళ్లపై జనాల్లో ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. #congress #cm-revanth-reddy #indiramma-housing-scheme #congress-six-guarantees #double-bed-room-scheme మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి