AP : సుప్రీంకోర్టు (Supreme Court) లో వైసీపీ (YCP) కి ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ (Postal Ballot) ఓట్ల లెక్కింపు (Counting Votes) వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. పోస్టల్ బ్యాలెట్‌లో ఫామ్ 13ఏపై అధికారి సంతకం ఉంటే సరిపోతుందని ఈసీ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ హైకోర్టుకు వెళ్లగా..ఈసీ వాదనతో హైకోర్టు ఏకీభవించింది.
Also Read : ఈ ఎన్నికల్లో రికార్డ్ స్థాయి ఓటింగ్-సీఈసీ
అయితే, హైకోర్టు తీర్పుపై వైసీపీ సుప్రీంకోర్ట్‌ను ఆశ్రయించింది. పోస్టల్ బ్యాలెట్ ఓటుపై సీలు లేకున్నా కౌంటింగ్‌కు అర్హత ఉంటుందని హైకోర్టు ఇచ్చిన తీర్పును వైసీపీ సుప్రీంలో సవాల్ చేసింది. విచారణ జరిపిన న్యాయస్థానం హైకోర్టు ఉత్తర్వులపై జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.