Breaking: పోస్టల్ బ్యాలెట్ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వైసీపీ
పోస్టల్ బ్యాలెట్ ఓటుపై సీలు లేకున్నా కౌంటింగ్ నిర్వహించే అర్హత ఉంటుందని ఇటీవల ఏపీ హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. దీంతో తాజాగా వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఎస్ఎల్పీ దాఖలు చేసింది.