Danam Nagender: బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే, మాజీ మంత్రి!

బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలేలా ఉంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. దీంతో ఆయన త్వరలో పార్టీ మారుతారని చర్చ రాష్ట్ర రాజకీయాల్లో మొదలైంది. మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా బీఆర్ఎస్‌కు రాజీనామా చేయనున్నట్లు సమాచారం.

New Update
Danam Nagender: బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే, మాజీ మంత్రి!

Danam Nagender to Join Congress: లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలో నేతల రాజీనామాల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ అయ్యారు. సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్‌లోకి భారీగా వలసలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్‌ను (BRS) వీడి హస్తం బాట పడుతున్న ఎంపీలు, మాజీమంత్రులు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో దానం నాగేందర్ భేటీ కావడంతో తిరిగి సొంత పార్టీలోకి చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ALSO READ: ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సోదాలు

మాజీ మంత్రి కూడా..

తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి సొంత నేతలే షాక్ ఇస్తున్నారు. కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేరనున్నట్లు తెలుస్తోంది. 18న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరతారని రాష్ట్ర రాజకీయాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే మాజీ మంత్రి మహేందర్ రెడ్డి కారు దిగి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. అయితే.. మాజీ మంత్రి కూడా ఇదే బాటలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

కేసీఆర్ మీటింగ్ కు డుమ్మా..

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందడంతో రానున్న లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు మాజీ సీఎం కేసీఆర్. ఈ క్రమంలో పార్టీ నేతలతో వరుస సమావేశలు ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కేసీఆర్ సమావేశాలు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి డుమ్మాలు కొడుతున్నారు. దీంతో ఆయన పార్టీ మారుతారనే చర్చకు మరింత బలం చేకూరినట్లైంది. ఇప్పటికే ఇంద్రకరణ్ రెడ్డితో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరికపై సన్నిహితులతో ఇంద్రకరణ్ రెడ్డి మంతనాలు జరిపినట్లు సమాచారం. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు