Shashi Tharoor: ఇద్దరి ఫొటోలు లీక్.. స్పందించిన శశిథరూర్ కాంగ్రెస్ ఎంపీ శశీథరూర్.. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాతో కలిసి దిగిన ఫోటోలు ఇటీవల వైరల్ అయ్యాయి. అయితే దీనిపై స్పందించిన ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆ ఫోటోలు ఓ పుట్టినరోజు వేడుకలో దిగినవంటూ తెలిపారు. కొందరు కావాలనే దురుద్దేశపూర్వకంగా ఆ ఫోటోలను ఎడిట్ చేశారంటూ పేర్కొన్నారు. ఇవి నీచపు రాజకీయాలంటూ ధ్వజమెత్తారు. పార్టీకి వచ్చిన మిగతావారందరిని తొలగించి.. కేవలం వ్యక్తిగతంగా ఉన్నట్లు ఫోటోలను వక్రీకరించారంటూ క్లారిటీ ఇచ్చారు. By B Aravind 23 Oct 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ఇటీవల కాంగ్రెస్ ఎంపీ శశీథరూర్.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాతో కలిసి పార్టీలో దిగినటువంటి ఫోటోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టాయి. అయితే దీనిపై స్పందించిన శశీథరూర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ఫోటోలను వైరల్ చేయడంపై మండిపడ్డారు. ఇవి నీచపు రాజకీయాలంటూ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన కేరళలోని కొట్టాయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇవి దిగజారుడు రాజకీయాలు. అందులో కనిపిస్తున్న ఫోటోలు ఆమె పుట్టినరోజు వేడుకలో దిగినవి. ఆమె నా కంటికి చిన్న పిల్లలా కనిపిస్తుంది. అంతేకాదు ఆమె నా కంటే 18 నుంచి 20 ఏళ్లు చిన్నదని.. ఈ పుట్టినరోజు వేడుకల్లో 15 మంది వరకు పాల్గొన్నారని శశిథరూర్ అన్నారు. అలాగే అక్కడ తన సోదరి కూడా ఉందని తెలిపారు. కానీ కొంతమంది వ్యక్తులు కావాలనే దురుద్దేశంతో పార్టీకి వచ్చిన మిగతావారందరిని తొలగించి.. అది కేవలం ఓ వ్యక్తిగత సమావేశంగా ఉన్నట్లు ఫోటోలను వక్రీకరించారని తెలిపారు. ఈ ఫోటోలు చూసినవారు ఒక్క విషయాన్ని గమనించండి. అది ఒక రహస్య సమావేశమైతే.. మరి ఆ ఫోటోలు ఎవరు తీసుంటారు అని ప్రశ్నించారు. అది ఓ పుట్టినరోజు వేడుక అంటూ స్పష్టతనిచ్చారు. అయితే ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ ఫోటోపై వస్తున్న విమర్శలు తాను పట్టించుకోనని శశిథరూర్ అన్నారు. ప్రజల కోసం పనిచేయడానికి మాత్రమే ప్రాముఖ్యత ఇస్తానని పేర్కొన్నారు. ఇంతకుముందే ఈ ఫోటోలకు సంబంధించి మొహువా మొయిత్రా కూడా స్పందించారు. నాకు తెలుపు కంటే ఆకుపచ్చ రంగు నచ్చుతుంది. ఎందుకు ఫోటోలను క్రాప్ చేశారంటూ ఆమె కౌంటర్ వేశారు. అలాగే డిన్నర్‌కు వచ్చిన మిగతావారిని కూడా చూపించండి అంటూ తనదైన స్టైల్‌లో విమర్శలను తిప్పికొట్టారు. #congress #national-news #tmc #shashi-tharoor #mahua-moitra మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి