Sharmila : కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనానికి బ్రేక్?.. షర్మిల సంచలన వాఖ్యలు

కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేయడంపై ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో తన పార్టీ వీలినంపై అడ్డంకులు వస్తున్నాయన్న ఆమె.. ఈ నెల 30లోపు కాంగ్రెస్ పార్టీలో విలీనంపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఒకవేళ పార్టీ విలీనం కాకపోతే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతామని షర్మిల స్పష్టం చేశారు.

Sharmila : కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనానికి బ్రేక్?.. షర్మిల సంచలన వాఖ్యలు
New Update

కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేయడంపై ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో తన పార్టీ వీలినంపై అడ్డంకులు వస్తున్నాయన్న ఆమె.. ఈ నెల 30లోపు కాంగ్రెస్ పార్టీలో విలీనంపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఒకవేళ పార్టీ విలీనం కాకపోతే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతామని షర్మిల స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు వైఎస్ఆర్‌టీపీ పార్టీ సిద్దంగా ఉందన్నారు. మరోవైపు తుమ్మల నాగేశ్వర్ రావు కాంగ్రెస్‌లో చేరడంతో షర్మిల సీటు సందిగ్ధంలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే పార్టీ విలీనంపై ఇంతలా ఎన్నడూ మాట్లాడని షర్మిల ఇప్పుడు మాట్లాడుతున్నారనే టాక్‌ వినిపిస్తోంది.

మరోవైపు షర్మిల వైటీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానడంతో వైటీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ వస్తోందని ఆశించిన చాలా మంది ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతుండటం కూడా షర్మిల ప్రకటనకు కారణంగా చెప్పవచ్చు గతంలో గాయకుడు సోమన్నను తుంగతుర్తి అసెంబ్లీ అభ్యర్థి షర్మిల ప్రకటించగా.. ప్రస్తుతం ఆమె పార్టీ విలీనంపై దృష్టి పెట్టడంతో ఇతర పార్టీల నుంచి తనకు ఎమ్మెల్యే టికెట్ రావడం కస్టమని ముందే భావించి వైటీపీ నుంచి బీఆర్ఎస్‌లోకి వేళ్లాడు. ఇంకొందరు కూడా ఇలానే పార్టీ మారాలని చూస్తుండటంతో షర్మిల తన పార్టీకి చెందిన నేతలు చేయి దాటి వెళ్లకుండా చూసుకుంటున్నారు.

కాగా షర్మిల కాంగ్రెస్‌లో చేరడాన్ని కాంగ్రెస్‌ పార్టీలోని ఓ వర్గం అడ్డుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. షర్మిల అనుచరులు పార్టీలోకి వస్తే తమ పరిస్థితి ఏంటని పెద్ద నాయకుల సహచరులు అంటున్నారని, దీంతో వారు షర్మిలను పార్టీలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతే కాకుండా ఎన్నికల తర్వాతే షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని కాంగ్రెస్‌ నేతలు పట్టుబడుతున్నారని తెలుస్తోంది. దీంతో ఇన్ని రోజులూ ఓపిగ్గా ఉన్న షర్మిల.. ప్రస్తుతం ఒపిక నశించడంతో వైటీపీ పార్టీ ఒంటరిగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

#congress #elections #ys-sharmila #sensational-comments #competition #ytp #merger
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe