Sharmila : కాంగ్రెస్లో వైఎస్సార్టీపీ విలీనానికి బ్రేక్?.. షర్మిల సంచలన వాఖ్యలు
కాంగ్రెస్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేయడంపై ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్లో తన పార్టీ వీలినంపై అడ్డంకులు వస్తున్నాయన్న ఆమె.. ఈ నెల 30లోపు కాంగ్రెస్ పార్టీలో విలీనంపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఒకవేళ పార్టీ విలీనం కాకపోతే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతామని షర్మిల స్పష్టం చేశారు.