Shami: వస్తారు.. పోతారు.. పాండ్యాపై షమీ షాకింగ్‌ కామెంట్స్!

ఆటగాళ్లు వస్తారు, వెళ్తారంటూ పాండ్యా ఎపిసోడ్‌పై కామెంట్స్‌ చేశాడు షమీ. రానున్న ఐపీఎల్‌ సీజన్‌కు హార్దిక్‌పాండ్యా ముంబైకి ఆడనున్న విషయం తెలిసిందే. హార్దిక్‌ను గుజరాత్‌ జీవితకాలం జట్టులోకి తీసుకోలేదని గుర్తుచేశాడు. ఎవరైనా ఏదో ఒక రోజు వెళ్లాల్సిందేనన్నాడు.

Shami: వస్తారు.. పోతారు.. పాండ్యాపై షమీ షాకింగ్‌ కామెంట్స్!
New Update

Shami Reacts on Pandya Episode: ఐపీఎల్‌లో 2021వరకు ముంబై ఇండియన్స్‌(Mumbai Indians)కు ఆడిన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌పాండ్యా(Hardik Pandya) 2022లో గుజరాత్‌ టైటాన్స్‌కు మారిన విషయం తెలిసిందే. గుజరాత్‌ అతడిని కెప్టెన్‌ చేసింది. కెప్టెన్‌గా మారిన తొలి సిజన్‌లోనే(2022) గుజరాత్‌కు కప్‌ తెచ్చిపెట్టాడు హార్దిక్‌. ఇక గతేడాది(2023) ఐపీఎల్‌ సీజన్‌లో గుజరాత్‌ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అంటే కెప్టెన్సీ చేసిన రెండు ఎడిషన్స్‌లోనూ ఫైనల్‌వరకు గుజరాత్‌ రాగలిగింది. అయితే వచ్చే సీజన్‌కు అనూహ్యంగా గుజరాత్‌ నుంచి ముంబైకి ట్రేడ్‌ అయ్యాడు పాండ్యా. ఇది ముంబై ఇండియన్స్‌ అభిమానుల్లో పెను దుమారాన్నే రేపింది. ఇక తాజాగా హార్దిక్‌పాండ్యా జట్టును వీడడంపై గుజరాత్‌ టైటాన్స్‌(Gujarat Titans) ప్లేయర్‌, టీమిండియా స్టార్‌ బౌలర్ మహ్మద్‌ షమీ(Mohammed Shami) స్పందించాడు.

షమీ ఏం అన్నాడంటే?

ఆటగాళ్లు వస్తారు, వెళ్తారంటూ పాండ్యా ఎపిసోడ్‌పై కామెంట్స్‌ చేశాడు షమీ. ఇంకా మాట్లాడుతూ 'చూడు, ఎవరు వెళ్ళిపోతున్నా ఫర్వాలేదు. జట్టు సమతూకం చూడాల్సిందే. హార్దిక్ అక్కడే ఉన్నాడు, అతను మాకు బాగా నాయకత్వం వహించాడు. రెండు ఎడిషన్లలోనూ మమ్మల్ని ఫైనల్‌కు తీసుకెళ్లి 2022లో టైటిల్ గెలిచాడు. కానీ గుజరాత్ మాత్రం హార్దిక్ ను జీవితకాలం జట్టులోకి తీసుకోలేదు. అది ఆయన నిర్ణయమే. ఇప్పుడు గిల్‌ను కెప్టెన్‌గా చేస్తే అనుభవం కూడా లభిస్తుంది. ఏదో ఒక రోజు అతను కూడా వెళ్లిపోవచ్చు. అది ఆటలో ఒక భాగం. ఆటగాళ్లు వస్తారు, వెళ్తారు' అని షమీ చెప్పుకొచ్చాడు.

'కెప్టెన్‌గా ఉన్నప్పుడు మీ ఆటతీరును చూసుకుంటూనే బాధ్యతను నిర్వహించడం చాలా ముఖ్యం. ఈసారి ఆ బాధ్యతను గిల్‌కు అప్పగించారు. అతని మనస్సులో కొంత భారం ఉండవచ్చు, కానీ ఆటగాళ్లు దాదాపు ఒకేలా ఉంటారు. కాబట్టి అతను ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆటగాళ్లను చక్కగా మేనేజ్ చేసి, అత్యుత్తమ ప్రతిభను వెలికి తీయాలి' అని షమీ అభిప్రాయపడ్డాడు. 2023 ఐపీఎల్‌ ఎడిషన్‌లో టైటాన్స్ తరుఫున 28 వికెట్లు పడగొట్టిన తీశాడు షమీ. ఇక 2023 వన్డే వరల్డ్‌కప్‌లో షమీ కేవలం 7 మ్యాచ్‌ల్లోనే 24 డిస్మిసల్స్ సాధించి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

Also Read: ఫ్రిడ్జ్‌లో ఉంచకూడని ఆహారాలు ఇవే.. తప్పక తెలుసుకోండి!

WATCH:

#gujarat-titans #hardik-pandya #rohit-sharma #ipl-2024 #mohammed-shami #cricket #mumbai-indians
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe