Karnataka : మాజీ ప్రధాని మనవడిపై లైంగిక వేధింపుల కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు

కర్ణాటకలో హసన సెక్స్ కుంభకోణం సంచలనం రేపుతోంది. మాజీ ప్రధాని దేవగౌడ కొడుకు హెచ్డీ రేవణ్ణ, ఆయన కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణలపై వారి సమీప బంధువే ఫిర్యాదు ఇవ్వడంతో ఈ విషయంలో ఇప్పుడు మరింత కలకలం రేగుతోంది.

New Update
Karnataka : మాజీ ప్రధాని మనవడిపై లైంగిక వేధింపుల కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు

Hasana Sex Scandal : కర్నాటక(Karnataka) లోని హసన ఎంపీ, ఏఈడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna). ఇతను మాజీ ప్రధాని దేవగౌడకు మనుమడు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి అన్న కొడుకు. ప్రజ్వల్‌ నాన్న మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ. ప్రస్తుతం కర్నాటకలో ప్రజ్వల్ సెక్స్ స్కాండల్ రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఇతను యువతులను ప్రలోభాలకు గురిచేసి లైంగిక వాంఛలు తీర్చుకోవడమే కాక వాటిని వీడియోలుగా కూడా తీసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అసలు వ్యవహారం అంతా దాంతోనే బయటపడింది కూడా. అమ్మాయిలకు తెలియకుండా వీడియోలు తీసి, వాటి ఆధారంగా వారిని బెదిరించి ప్రజ్వల్ రేవణ్ణ లొంగదీసుకున్నాడని, వాటిని వీడియోలు చేసుకుంటున్నారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఏకంగా మూడు వేల వీడియోలు ఉంటాయని అంటున్నారు.

దేశం విడిచి పారిపోయాడు..

ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్(Sex Scandal) కర్ణాటకును కుదిపేస్తోంది. ఇందులో వాస్తవాలను వెలికి తీసేందుకు ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. హాసన లోక్‌సభ సభ్యునిగా ప్రజ్వల్‌ రేవణ్ణ ఎన్నిక చెల్లదని ఉన్నత న్యాయస్థానం ఇప్పటికే ఆదేశాలను ఇచ్చింది. మరోవైపు లైగింక వేధింపుల ఆరోపనలు వచ్చాక ప్రజ్వల్ రేవణ్ణ దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం అతను జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.

సమీప బంధువు దగ్గర నుంచే కంప్లైంట్‌

తాజాగా హెచ్డీ రేవణ్ణ, అతని కూమారుడు ప్రజ్వల్ మీద లైగింక దైర్జన్యం కేసు నమోదు అయింది. వారికి సమీప బంధువే అయిన 47 ఏళ్ళ మహిళ ఈ ఫిర్యాదు చేసింది. ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణకు మేనత్త కూతురు. 2015లో ఈమెకు హెచ్డీ రేవణ్ణ తమ ఇంట్లో పని ఇప్పించారు. ఈమె కాకుండా వీరి ఇంట్లో మరో ఆరుగురు మహిళలు, యువతులు కూడా పని చేస్తున్నారు. అయితే వారి ఇంట్లో పనిలో చేరిన నాలుగు నెలల నుంచే తనపై లైంగిక దాడులు మొదలయ్యాయని బాధితురాలు చెప్పింది. భవానీ రేవణ్ణ ఇంట్లో లేని సమయంలోనే తనపై లైంగిక దౌర్జన్యానికి దిగేవారని బాధితురాలు ఆరోపించారు. పళ్ళ/ ఇచ్చే సాకుతో స్టోర్‌ రూమ్‌కు పిలిచేవారని..నలుగు స్నానం చేయించాలని, ఒంటికి నూనె పెట్టి స్నానం చేయించాలని బాత్‌రూమ్‌‌కి తీసుకువెళ్లి లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డారని వాపోయారు. అలాగే ప్రజ్వల్‌ కూడా తన కుమార్తతో ఫోన్లో అసభ్యంగా ప్రవర్తించేవాడని చెప్పారు. ఆ బాధ భరించలేక తన కూతురు అతడిని బ్లాక్ చేసిందని తెలిపారు. ఆ తర్వాత తానూ పనిని విడిపెట్టి బయటకు వచ్చేశానని చెప్పారు. ఇప్పుడు వీడియోలు బయటకు రావడంతో కంప్లైంట్ చేస్తున్నాని అన్నారు.

Also Read:Andhra Pradesh : తమ్ముడి కోసం అన్న..ఆరోజు నుంచే చిరంజీవి ప్రచారం?

Advertisment
Advertisment
తాజా కథనాలు