మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం దాటికి ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఛత్రపతి శంభాజీ నగర్‌లో ఉదయం 4 గంటలకు టైలరింగ్ షాప్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు ఫైర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు.
Also Read: భారీ అగ్ని ప్రమాదం.. 58 ఇళ్లు ఆహుతి!
పొగ పీల్చుకొని
అయితే ఈ ప్రమాదంలో.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు కుటుంబ సభ్యులు మృతి చెందినట్లు గుర్తించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులతో పాటు మరో ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అగ్నిప్రమాదం టైలర్ షాప్‌లో జరిగింది. మృతిచెందిన వారు పైఫ్లోర్‌లో ఉంటున్నారు. అయితే టైలర్ షాప్ అగ్ని ప్రమాదం జరిగాక.. దాని నుంచి వెలువడిన పొగ పీల్చుకొని ఆ కుటుంబ సభ్యులు మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: పెట్రోల్, డీజిల్ ధరలపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్..
బీహార్‌లో 50కి పైగా ఇళ్లు దగ్ధం
ఇదిలా ఉండగా.. బీహార్‌లో కూడా ఘోర అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో సుమారు 50కి పైగా ఇళ్లు తగలబడ్డాయి. అలాగే ఓ ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ కూడా పేలడంతో మంటలు ఇంకా ఎక్కువగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో కొన్ని లక్షల ఆస్తి బూడిద పాలైయ్యింది. ఓ ఇంట్లోని తండ్రీ కొడుకులు పూర్తిగా కాలిపోయారు. దీంతో వారి పరిస్థితి విషమంగా ఉండటంతో.. స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.