Breaking: భారీ అగ్ని ప్రమాదం.. 58 ఇళ్లు ఆహుతి! బీహార్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 50కి పైగా ఇళ్లు తగలబడ్డాయి. దీంతో ఓ ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ కూడా పేలడంతో మంటలు ఇంకా ఎక్కువగా వ్యాపించాయి. ఈ సంఘటనలో కొన్ని లక్షల ఆస్తి బూడిద పాలైయ్యింది By Bhavana 03 Apr 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Fire Accident: బీహార్లో ఘోర అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 50కి పైగా ఇళ్లు తగలబడ్డాయి. దీంతో ఓ ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ కూడా పేలడంతో మంటలు ఇంకా ఎక్కువగా వ్యాపించాయి. ఈ సంఘటనలో కొన్ని లక్షల ఆస్తి బూడిద పాలైయ్యింది. ఈ ప్రమాదంలో ఓ ఇంట్లోని తండ్రీ కొడుకులు పూర్తిగా కాలిపోయారు. దీంతో వారి పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిని కిషోర్ రాయ్, అతని కుమారుడు ఆశిష్ కుమార్(4) గా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో బాలుడు కూడా తప్పిపోయాడు. ఈ అగ్ని ప్రమాదంలో చాలా పశువులు కాలిపోయి, చనిపోయాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్లతో చేరుకున్నారు. ఒక గంట తర్వాత మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అగ్ని ప్రమాదం గురించి తెలిసి కూడా ఏ అధికారి ఈ అక్కడికి చేరుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన జాడియా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగింది. మంగళవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరగగా 51 ఇళ్లు బూడిదయ్యాయి. మంటల కారణంగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఆ తరువాత మంటలు మరింత తీవ్రంగా మారాయి. చుట్టు పక్కల వారు ప్రమాదం గురించి తెలుసుకునే లోపే మంటలు చుట్టూ వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది గ్రామస్తుల సహాయంతో కష్టపడి పనిచేసి మంటలను నియంత్రించగలిగారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ఆవులు, దూడలు చనిపోయాయి. 50 కి పైగా మేకలు కూడా కాలిపోయాయి. వందలాది వస్తువులు, మోటారు సైకిళ్ళు, పిండి మిల్లు యంత్రాలు బూడిదయ్యాయి. Also read: ముగిసిన 33 ఏళ్ల రాజకీయ ప్రయాణం.. ఇక నుంచి ఆ సీట్లో! #burnt #fireaccident #bihar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి