/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/56-jpg.webp)
Hari Rama Jogayya : తాజాగా కాపు నాయకుడు, మాజీ మంత్రి చేంగొడి హరిరామ జోగయ్య జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను (Pawan Kalyan) కలిశారు. పవన్ కల్యాణ్‌ను సీఎంగా చూడాలనుకుంటున్నాని అన్నారు. దీనికి సంబంధించి ఓ సుదీర్ఘ లేఖ కూడా రాశారు. ఇప్పుడు రెండు పార్టీల మధ్యా సీట్ల గొడవ జరుగుతున్న నేపథ్యంలో హరిరామజోగయ్య మరోసారి లెటర్ రాశారు. ఇందులో వచ్చే ఎన్నికల్లో జనసేనకు (Janasena) 50అసెంబ్లీ, 6 ఎంపీ సీట్లివ్వాలని పేర్కొన్నారు. పొత్తు ధర్మానికి టీడీపీ (TDP) తూట్లు పొడుస్తోందని ఆయన విమర్శించారు. జనసేనకు 20 నుంచి 30 సీట్లిస్తే పొత్తు విఫలమే అని హరిరామ జోగయ్య వ్యాఖ్యానించారు.
Also Read: AP Politics: జనసేన..టీడీపీ.. ఔర్ బీజేపీ.. ఏమవుతోంది?
టీడీపీతో పొత్తు వలన పవన్ ఆశయాలకు భంగం కలుగుతోందని హరిరామ జోగయ్య అంటున్నారు. 2019లో ఓడిపోయిన జనసేన నేతలు పోటీకి రెడీగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో తమ లక్‌ను పరీక్షించుకోవాలనుకుంటున్నారని.. జనసేనకు తక్కువ సీట్లిస్తే వారిని నిరాశపరిచినట్టే అవుతుందని లేఖలో జోగయ్య రాసుకొచ్చారు.
మరోవైపు ఏపీ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. ఇంతవరకూ నివురుకప్పిన నిప్పులా రగిలిపోతున్న జనసేన శ్రేణులు ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీపై తిరుగుబావుటా ఎగరేశారు. ఒక పక్క తాము ఒక్కటిగా ఉన్నామని.. ఉంటామని.. తమతో బీజేపీ (BJP) కూడా కలిసి వస్తుందని ఇన్నాళ్లూ చెబుతూ వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ మాటల్లోనూ.. చేతల్లోనూ తేడా కనిపిస్తోంది. టీడీపీ, జనసేన రెండు పార్టీలు పొత్తు ధర్మాన్ని పక్కన పెట్టి వేర్వేరుగా అభ్యర్ధులను ప్రకటించడంతో...ఇద్దరు నాయకుల మధ్యా విభేధాలున్నాయన్న సంగతి తెలుస్తోంది. దానికి తోడు ఈరోజు పిఠాపురంలో ఇరు పార్టీల నేతలూ కొట్టుకోవడం ఈ పరిస్థితులను మరింత తీవ్రతరం చేసేశాయి. నాలుగు రోజుల క్రితం వరకూ చేతిలో చెయ్యేసి తిరిగిన పవన్, బాబుల మధ్య అసలు ఏమి జరుగుతోంది? ఒక్కసారిగా పొత్తుల ధర్మం అంటూ పవన్ కళ్యాణ్ ఎందుకు ఆవేశపడుతున్నారు అనే ప్రశ్న ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అందరినీ తొలిచేస్తోంది.
Also Read:Telangana : రేషన్ కార్డ్ కేవైసీ చేయించారా.. అయితే త్వరపడండి.. గడువు దగ్గరపడుతోంది.