Assembly Sessions Secon Day:ఏపీలో రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంమయ్యాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చించనున్నారు. చివరగా సీఎం జగన్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపనున్నారు. ధన్యవాద తీర్మానాన్ని టీజేఆర్ సుధాకర్ ప్రవేశపెట్టారు. అయితే టీడీపీ పెట్రోల్, డీజిల్ ధరలపై వాయిదా తీర్మానాన్ని అడిగింది. దీన్ని స్పీకర్ తోసిపుచ్చారు. మరోవైపు గంటా శ్రీనివాసరావు ఇచ్చిన రాజీనామాకు ఆమోదం తెలిపారు.
ధన్యవాద తీర్మానం మీద చర్చలో చివరలో సీఎం జగన్ మాట్లాడనున్నారు. రెండు గంటల పాటూ ఈ ప్రసంగం ఉంటుందని చెబుతున్నారు. జగన్ మాట్లాడిన తరువాత వైసీపీ ప్రభుత్వం రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఏపీ అద్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు-2024, ఏపీ అద్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు- 2024 లను ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. ఇక ఉదయం 10 గంటలకు ఏపీ శాసన మండలిలో కూడా సమావేశాలు ప్రారంభం అవుతాయి. శాసనమండలిలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు.
ఏపీ అసెంబ్లీ వద్ద హై టెన్షన్..
మరోవైపు అసెంబ్లీ ముట్టడించేందుకు సర్పంచులు రావడంతో అక్కడ హైటెన్షన్ నెలకొంది. అసెంబ్లీ వద్ద సర్పంచుల సంఘం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే రోడ్డుపై బైఠాయించి సర్పంచులు నిరసన వ్యక్తం చేశారు. సర్పంచ్ సంఘం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read:Gruha Jyothi : 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్.. గృహజ్యోతి రిజిస్ట్రేషన్స్ స్టార్ట్!
రేపు ఓటాన్ అకౌంట్ బడ్జెట్...
ఇక అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజులు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రేపు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఫిబ్రవరి 7న ఉభయసభల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది... ఫిబ్రవరి 8న బడ్జెట్‌పై ఇరుసభల్లో ప్రజాప్రతినిధులు చర్చించనున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ సైతం హాట్ హాట్‌గానే జరగనుంది.
గవర్నర్ ప్రసంగంలోని ముఖ్య అంశాలు ఇవే..
‘విజయవాడలో 206 అడుగుల బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాం..సాంఘిక న్యాయం సమానత్వం కోసం మా ప్రభుత్వం పనిచేస్తోంది..పేదపిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం..నవరత్నాల హామీలను మా ప్రభుత్వం అమలుచేసింది.. ప్రతి ఒక్కరికి ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం..విద్య కోసం 73వేల కోట్లకు పైగా ఖర్చుపెట్టింది.. జగనన్న అమ్మ ఒడి పథకం కింద 15వేలు నేరుగా తల్లుల ఖాతాల్లో జమచేస్తోంది..దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చాం..
మాది పేదల పక్షపాత ప్రభుత్వం..పేదరికం 11.25 శాతం నుంచి 4.1శాతానికి తగ్గింది..జగనన్న గోరుముద్ద కింద నాణ్యమైన మధ్యాహ్న భోజన పథకం అమలుచేశాం.. 43లక్షలమందికి పైగా జగనన్న గోరుముద్ద పథకం..ఏడాదికి 4,416 కోట్లు ఖర్చుచేశాం..విద్యా కానుక కింద విద్యార్థులకు యూనిఫాం సహా బుక్స్..విద్యాకానుకకు 3,367 కోట్లు ఖర్చు చేశాం..ఐటీఐ, ఇంజనీరింగ్..11వేల కోట్లకు పైగా రీయింబర్స్ చేశాం’ అని ప్రభుత్వం అమలు పరిచిన పథకాలను గవర్నర్ అబ్దుల్ నజీర్ వివరిస్తూ పలు అంశాలు ప్రసంగించారు.