కొత్త లుక్ లో సామ్!
తాజాగా సమంత కొన్ని చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. వాటిలో సమంత కొత్త లుక్ లో చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది. జుట్టు కట్ చేయించుకుని బీచ్ వద్ద నుంచుని ప్రకృతిని ఆరాధిస్తున్న ఫోటోని సామ్ పోస్ట్ చేశారు.
కొనసాగిన వాయిదాల పర్వం... ఉభయ సభలు రేపటికి వాయిదా..!
లోక్ సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మణిపూర్ అంశంపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ రోజు సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో సభలో గందర గోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో సభను మొదట 12 గంటల వరకు వాయిదా వేశారు.
పాలు తాగుతున్న నంది విగ్రహం.. ఆశ్చర్యానికి లోనైన భక్తులు
నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం బషీరాబాద్ లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న మహదేవుని ఆలయంలోని నందీశ్వరుని విగ్రహం పాలు తాగుతుండటంతో భక్తులు ఆశ్చర్యానికి..
ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైన కాంగ్రెస్.. ఆగస్ట్ మొదటి వారంలో బస్సుయాత్ర
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమౌతోంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో.. ప్రజలకు దగ్గర కావాలని నిర్ణయం తీసుకున్న పీసీసీ.. ఇందులో భాగంగానే వచ్చే నెల నుంచి బస్సుయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు.
వైసీపీ పాలనలో వృక్షాలు విలపిస్తున్నాయని పవన్ సెటైర్లు
వారాహియాత్ర సక్సెస్ తర్వాత ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా కౌంటర్లు మీద కౌంటర్లు వేస్తున్నారు. ప్రభుత్వ పాలనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ, విద్యా వ్యవస్థపై ట్వీట్స్ చేసిన పవన్.. తాజాగా సీఎం జగన్ పర్యటనల సందర్భంగా చెట్ల నరికివేతపై సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు.
ఇది పేదల విజయం.. ఇక నుంచి "అమరావతి మనందరి అమరావతి"
అమరావతి ప్రాంతంలోని ఆర్5 జోన్లో పేదల ఇళ్ల నిర్మాణాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంసభలో మాట్లాడుతూ ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. పేదలకు మంచి జరుగుతుంటే కోర్టుల్లో కేసు వేసి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
టీఎస్పీఎస్సీ కేసులో మరో 15 మంది నిందితుల గుర్తింపు!
తెలంగాణ టీఎస్పీఎస్సీ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి సుమారు 90 మందిని అరెస్ట్ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మరికొద్ది రోజుల్లో ఈ సంఖ్య 100 కి చేరే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.