వివస్త్రను చేసి పంచాయతీలో నిలబెట్టి..మరో దారుణ ఘటన!
బెంగాల్ లో దారుణ ఘటన జరిగింది. ఓ గిరిజన మహిళను పంచాయతీలో అందరూ చూస్తుండగా వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డారు.
బెంగాల్ లో దారుణ ఘటన జరిగింది. ఓ గిరిజన మహిళను పంచాయతీలో అందరూ చూస్తుండగా వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డారు.
జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ ఇద్దరూ తమ కెరీర్లలో ఒకేలా 311 టెస్ట్ వికెట్లు పడగొట్టారు. ఇషాంత్ తన కెరీర్లో 105 టెస్ట్ మ్యాచ్ లు ఆడగా, జహీర్ ఇండియాలో రెడ్ బాల్ క్రికెట్ మ్యాచ్ లలో 92 మ్యాచ్ లు ఆడాడు. ఈ కాకతాళీయ 'ఘటన' ఇక్కడితో ఆగలేదు. ఇద్దరూ ఒకేసారి 11 సార్లు 5 వికెట్లు, ఓసారి 10 వికెట్లు తీశారు. భారతీయ గడ్డపై ..స్వదేశంలో 104 వికెట్లు, ఇతర దేశాల్లో 207 వికెట్లు తీశారు. లెక్కల్లో తాను, జహీర్ ఇద్దరూ వీక్ అని, కానీ తమ కెరీర్లలో ఇలా పోలికలు ఉండడం చూసి తాము షాక్ తిన్నామని ఇషాంత్ చెప్పాడు.
హైదరాబాద్ ఐఐటీ మిస్సింగ్ మిస్టరీ విషాదంగా ముగిసింది. కనిపించకుండా పోయిన విద్యార్థి కార్తీక్ విశాఖ బీచ్ లో శవమై తేలాడు. జులై 17 రాత్రి నుంచి కార్తీక్ కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు..కార్తీక్ వైజాగ్ వెళ్లినట్లు గుర్తించారు.
హైదరాబాద్ హస్తినాపురంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చెందిన అంబులెన్స్ బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్ సజీవదహనం అయ్యాడు. అంబులెన్స్ బోల్తాపడగానే...ఆక్సీజన్ సిలిండర్ పేలింది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత తరగతుల పాఠశాలల వేళలను మార్చుతు తెలంగాణ విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త నోటిఫికేషన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభమై. సాయంత్రం 4.15 గంటల వరకు కొనసాగుతాయి. ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు కొనసాగుతాయి.
ఇవాళ(జులై 25) ఇందిరాపార్క్, ధర్నా చౌక్ దగ్గర మహాధర్నాకు పిలుపునిచ్చిన బీజేపీకి వరణుడు బ్రేకులు వేశాడు. తెలంగాణలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధర్నాను వాయిదా వేస్తున్నట్లు టీబీజేపీ ప్రకటించింది.
కెనడాలో పిజ్జా డెలివరీ చేస్తున్న భారతీయ విద్యార్థిపై దుండగులు దాడిచేశారు. దుండగుల దాడిలో తీవ్ర గాయాలైన విద్యార్థి చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన కెనడాలోని మిస్సిసాగాలో చోటుచేసుకుంది.
హైదరాబాద్ లో వాన దంచికొట్టింది. సోమవారం సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ...వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
హైదరాబాద్ జంటనగరాల పరిధిలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండగా.. నగరాన్ని నల్లటి మేఘాలు కమ్మేసి చీకటిగా మార్చాయి. నగరంలోని నాచారం, మల్లాపూర్, ముషీరాబాద్, కొండాపూర్, మాదాపూర్, హబ్సీగూడలో భారీ వర్షం దంచి కొడుతోంది. దీంతో నగరమంతా తడిసి ముద్ధయ్యింది. పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ప్రజలు అత్యవసరమైతే తప్పా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కోరారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు సమీక్షిస్తున్నారు.