భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టెస్ట్ అయిదోది, తుది మ్యాచ్ కి వరుణుడు మాటిమాటికీ అడ్డుపడినప్పటికీ ఇక్కడో విచిత్రం జరిగింది. ఈ టెస్ట్ కి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన మాజీ ఇండియన్ పేసర్లు ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్.. ఇద్దరూ తమతమ కెరీర్లలో దిగ్భ్రాంతికరమైన రికార్డులు ఉండడం చూసి షాక్ తిన్నారు. అదే సమయంలో వారి సంతోషానికి అంతు లేకుండా పోయింది కూడా.. ఇది కాకతాళీయమో ఏమో గానీ.. అచ్చు గుద్దినట్టున్న వీరి రికార్డులు చూసి.. నెటిజనులు సైతం .. ఇదేందయ్యా ఇట్లా ఉంది అంటూ తమాషాగా సెటైర్లు వేస్తూ తాము కూడా ఆశ్చర్యపోతున్నారు.
పూర్తిగా చదవండి..వాళ్లిద్దరి టెస్ట్ రికార్డులూ సేమ్ టు సేమ్.. వండర్ !!
జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ ఇద్దరూ తమ కెరీర్లలో ఒకేలా 311 టెస్ట్ వికెట్లు పడగొట్టారు. ఇషాంత్ తన కెరీర్లో 105 టెస్ట్ మ్యాచ్ లు ఆడగా, జహీర్ ఇండియాలో రెడ్ బాల్ క్రికెట్ మ్యాచ్ లలో 92 మ్యాచ్ లు ఆడాడు. ఈ కాకతాళీయ 'ఘటన' ఇక్కడితో ఆగలేదు. ఇద్దరూ ఒకేసారి 11 సార్లు 5 వికెట్లు, ఓసారి 10 వికెట్లు తీశారు. భారతీయ గడ్డపై ..స్వదేశంలో 104 వికెట్లు, ఇతర దేశాల్లో 207 వికెట్లు తీశారు. లెక్కల్లో తాను, జహీర్ ఇద్దరూ వీక్ అని, కానీ తమ కెరీర్లలో ఇలా పోలికలు ఉండడం చూసి తాము షాక్ తిన్నామని ఇషాంత్ చెప్పాడు.
Translate this News: