పైశాచికత్వం...తలపై బాది.. మూత్రం పోసి.. మరో అమానవీయ ఘటన...!! నేటి సమాజం ఎటు పయనిస్తుందో..గమ్యమెటో తెలియని పరిస్ధితి దాపురించింది. ఆధునిక కాలంలోనూ ఆటకవికంగా ప్రవర్తిస్తూ..మనషులనే విషయాన్ని మరిచిపోతున్నారు. అమాయక ప్రజలపై పలు చోట్ల ఇటీవల జరుగుతోన్న వరస దాడులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొన్న మధ్యప్రదేశ్ లో గిరిజనుడిపై మూత్రంపోసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటు ఏపీలోనూ ఇలాంటి మరో ఘటన చోటుచేసుకుంది. ఇప్పుడు ఆగ్రాలో అలాంటి ఘటనే మరోకటి జరిగింది. ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టి..రక్తం కారుతుండా పైశాచికత్వంతో బాధితుడి ముఖంపై మూత్ర విసర్జన చేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. By Bhoomi 25 Jul 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి ఆగ్రాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అతుస్ గ్రామంలో ఓ గిరిజన యువకుడి ముఖంపై మూత్ర విసర్జన చేసిన ఉదంతం తెరపైకి వచ్చింది. ఈ ఘటనలో కొందరు దుండగులు ఓ యువకుడిని దారుణంగా కొట్టారు. తీవ్రగాయాలతో బాధపడుతున్న ఆ యువకుడి ముఖంపై మూత్ర విసర్జన చేశారు.ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. వీడియో ఆధారంగా పోలీసులు ప్రధాన నిందితుడితో సహా ఇద్దరిని అరెస్టు చేశారు. సోమవారం మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు 30 సెకన్ల నిడివి ఉన్న వీడియోలో, రక్తం కారుతున్న యువకుడు నేలపై అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. పక్కనే కొంతమంది యువకులు నిలబడి ఉన్నారు. ఒక యువకుడి ముఖం కనిపిస్తుంది. మరొకరి గొంతు వినబడుతుంది. దుర్భాషలాడుతూ ఆ గిరిజన యువకుడి ముఖంపై మూత్ర విసర్జన చేశారు. Your browser does not support the video tag. బాధిత యువకుడు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ సమీపంలో నిలబడి ఉన్న యువకులు అతన్ని గట్టిపట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గామారడంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వీడియో సికంద్రా ప్రాంతంలోని అటస్ గ్రామానికి సమీపంలో ఉందని డిసిపి సిటీ సూరజ్ కుమార్ రాయ్ తెలిపారు. దాడికి గురైన వ్యక్తి విక్రమ్ అలియాస్ విక్కీగా గుర్తించారు. వీడియోలో ఉన్న యువకుడిని ఆదిత్య ఇండోలియాగా గుర్తించారు.ఆదిత్య ఇండోలియా, అతని సహచరుడు భోలాను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఇద్దరు నిందితులను విచారించి మిగతా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధిత యువకుడి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో పోలీసులు నిందితులపై హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన ముఠాపై ఇప్పటికే 11 కేసులు ఉన్నట్లు పోలీసులు విచారణలో తేలింది. వీటిలో దోపిడీ, దొంగతనాల కేసులు ఉన్నట్లు చెప్పారు. #aditya #agra-peeing-incident #agra-viral-video #agra-urination #agra #crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి