ఆంధ్రప్రదేశ్ సాగునీటి ప్రాజెక్టులను వైసీపీ సర్కార్ నీరు గారుస్తోంది: చంద్రబాబు ఫైర్ టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై.. యుద్ధభేరి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. 9వ రోజు ఉమ్మడి విజయనగరం జిల్లాలో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి రిజర్వాయర్ ను చంద్రబాబు సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం అనేక సాగునీటి ప్రాజెక్టులను నీరు గారుస్తోందని దుయ్యబట్టారు. సీఎం జగన్ వల్ల ఎన్నో నీటి ప్రాజెక్టులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. అవే పూర్తి అయి ఉంటే.. ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ ఎంతో అద్భుతంగా ఉండేదన్నారు చంద్రబాబు. By E. Chinni 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన.. పార్టీలో చేరిన మాజీ మంత్రి మాజీ మంత్రి పడాల అరుణ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. పడాల అరుణ మెడలో జనసేన కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు పవన్. ఈ సందర్భంగా జనసేన చీఫ్ మాట్లాడుతూ.. పడాల అరుణ లాంటి సీనియర్ నేతలు జనసేనలో చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవలే తనను పడాల అరుణ కలిశారని పవన్ గుర్తు చేశారు. ప్రజల కోసం తాను పడుతున్న తపనను, పోరాటం పట్ల ఆకర్షితురాలినైనట్లు వెల్లడించారు. మీ పోరాటంలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నానని జనసేన పార్టీలో చేరతానన్నారని.. తాను స్వాగతించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. By E. Chinni 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చిరంజీవి కూడా జనసేన పార్టీలో చేరతారు: కేఏ పాల్ పవన్ కళ్యాణ్, చిరంజీవిలపై కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, పవన్ లు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. చిరంజీవి కూడా జనసేన పార్టీలో చేరతారని తాను ముందే చెప్పానని కేఏ పాల్ పేర్కొన్నారు. బీజేపీతో జనసేన పార్టీ ఎందుకు పొత్తు చేసుకుందంటే.. ఇన్ కమ్ టాక్స్ ఎగ్గొట్టడానికి కే అని వ్యాఖ్యానించారు. మోడీ, చంద్రబాబు, కేసీఆర్ లకు గుండు గీస్తానని ఘాటు వ్యాక్యలు చేశారు పాల్. బీజేపీ బీ పార్టీలను ఓడిస్తానని చెప్పారు. అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్, జెడీ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ నాగేశ్వర్, జయ ప్రకాష్ నారాయణ లాంటి మేధావులు కేవలం యాంకర్లుగా మిగిలిపోవద్దు కేఏ పాల్ విజ్ఞప్తి చేశారు. By E. Chinni 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కాకినాడలో లిక్కర్ వాహనం బోల్తా.. అందినకాడికి ఎత్తుకెళ్లిన మందుబాబులు!! కాకినాడ జిల్లా తుని మండలం గవరయ్య కోనేరు దగ్గర లిక్కర్ లోడుతో వెళ్తున్న మినీ వ్యాన్ బోల్తా పడింది. దీంతో మద్యం బాటిళ్లు అన్నీ కిందపడ్డాయి. ఇంకేముంది ఇలాంటి మంచి ఛాన్స్ ని మిస్ చేసుకుంటారా.. స్థానికులంతా ఎగబడ్డారు. సందట్లో సడేమియాలా దొరికిన వాళ్లకు దొరికినట్లు మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. ఇక ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. స్పాట్ కు చేరుకున్నారు. వెంటనే అక్కడున్న క్రౌడ్ ని క్లియర్ చేశారు. స్థానికులు మద్యం బాటిళ్లను తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు. By E. Chinni 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తూర్పు గోదావరి Viral Video: నడిరోడ్డుపై పాము, ముంగీస హల్చల్.. చూస్తూండిపోయిన జనం నడిరోడ్డుపై పాము, ముంగీస పోట్లాడుకున్న ఈ వీడియో తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలోని రహదారిపై జరిగింది. దాదాపు అరగంట సేపు ప్రధాన రహదారిపై తాచుపాము, ముంగీసలు కొట్టుకున్నాయి. ముంగిస దానితో పోరాటానికి ప్రయత్నించగా.. బుసలు కొడుతూ దానిని కాటు వేయడానికి తాచుపాము యత్నించింది. ఇది దూరంగా గమనించిన స్థానికులు, ప్రయాణికులు భయాందోళనకు గురై అరగంట పాటు అటు దిశగా వెళ్లలేదు. కాసేపు By E. Chinni 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Raod Accident: కర్నూలులో రోడ్డు యాక్సిడెంట్.. ఇద్దరు మృతి, మరో ఐదుగురికి గాయాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా హాలహర్వి మండంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయ పడ్డారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. By E. Chinni 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling ఒక బైక్ మీద ఏడుగురు ప్రయాణం..గాల్లో కలిసిపోతాయి అంటూ సజ్జనార్ హెచ్చరిక! ఒక బైక్ మీద ముగ్గురు కాదు..నలుగురు కాదు ఏకంగా ఏడుగురు ప్రయాణించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియోలో వైరల్ గా మారింది. ఈ వీడియోను తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. By Bhavana 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చిరంజీవి మాట్లాడింది కరెక్టే.. ఆయన చిన్న వ్యక్తి కాదు: ఉండవల్లి చిరు చెప్పింది కరెక్టేనని, సినిమా ఇండస్ట్రీ పిచ్చుక లాంటిదని అన్నారు. అయితే చిరంజీవి మాత్రం పిచ్చుక లాంటి వారు కాదని ఉండవల్లి పేర్కొన్నారు. చిరంజీవి ఒంటరిగా పోటీ చేసి 18 సీట్లు గెలిచారని, అలాంటి వ్యక్తి చిన్నవాడు ఎలా అవుతారని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాల కోసం ఆ రోజు గొంతు విప్పింది చిరంజీవే అని చెప్పారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించడంలో ఎలాంటి తప్పు లేదన్నారు ఉండవల్లి. ఆయన కారణంగానే హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడటం సాధారణ విషయం కాదన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. By E. Chinni 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వివాహ బంధంతో ఒక్కటైన ఐఏఎస్, ట్రైనీ ఐపీఎస్.. సింపుల్ గా రిజిస్ట్రార్ మ్యారేజ్ ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందిన యంగ్ ఐఏఎస్ ఆఫీసర్, ట్రైనీ ఐపీఎస్ లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంట నిరాడంబరంగానే వివాహం చేసుకున్నారు. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్, ట్రైనీ ఐపీఎస్ దేవేంద్ర కుమార్ లు.. మచిలీ పట్నం కలెక్టరేట్ లోని ఛాంబర్ లో జిల్లా రిజిస్ట్రార్ సమక్షంలో ఎంతో నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ దండలు మార్చుకుని రిజస్టర్ మ్యారేజ్ తో ఒక్కటయ్యారు. కొత్త జంటలకు కలెక్టర్ రాజా బాబా, కలెక్టరేట్ సిబ్బంది అభినందనలు తెలిపారు. By E. Chinni 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn