ఆంధ్రప్రదేశ్ విజయవాడలో దారుణం.. కూతురు ప్రేమకి.. తల్లి బలి!! విజయవాడలోని భవానీపురంలో లలిత అనే మహిళ తన భర్త, కుమార్తెతో నివసిస్తోంది. తనకు ఒక్కగానొక్క కూతుర్ని ఎంతో అల్లారు ముద్దగా పెంచుతూ.. తన కాళ్ల మీద తాను నిలబడేలా ఎంబీఏ వరకూ చదివించారు. దీంతో ఆమెకి హైదరాబాద్ లో జాబ్ వచ్చింది. ఓ ప్రైవేట్ కంపెనీలో మంచి స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత తాను ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నానని, అతడ్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని పేరెంట్స్ కి చెప్పింది. పేరెంట్స్ కూడా తన ప్రేమని ఒప్పుకోవడం లేదని.. ప్రేమించిన అబ్బాయితో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది యువతి. దీంతో తల్లి లలిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. By E. Chinni 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అడవి బిడ్డల దుస్థితి మారాలి.. ఎమోషనల్ అయిన పవన్ కళ్యాణ్ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరి పుత్రులకు ప్రేమ పూర్వక శుభాకాంక్షలు చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కొండకోనలు దాటి రావడానికి ఇష్టపడని ఈ అడవి బిడ్డలకు అనారోగ్యం చేసినా, ప్రసవానికి ఆస్పత్రికి వెళ్ళాలన్నా ఆ బాధలు వర్ణనాతీతమని పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు. అడవి బిడ్డలకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. కొండకోనల్లో నివసిస్తూ సంప్రదయాలను బతికించుకుంటున్నారని తెలిపారు. అడవి తల్లిని నమ్ముకున్న బిడ్డలు, కళ్లా కపటం ఎరుగని మనుషులు మన గిరిజనులని చెప్పారు.. By E. Chinni 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి వల్ల పోలవరం ప్రాజెక్ట్ కు చెప్పలేనంత నష్టం జరిగింది: చంద్రబాబు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పరిధిలోని కొత్తగా ఏ ఒక్క కట్టడం కూడా జగన్ రెడ్డి చేపట్టలేదని, ఇంకా 214 కట్టడాలు కట్టాల్సి ఉందని చెప్పారు. అలాగే 50 శాతం కనెక్టివిటీ పనులు పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. పురుషోత్తం పట్నం లిఫ్ట్ ఇరిగేషన్ ను పారిశ్రామిక, తాగు నీటి అవసరాలకు విశాఖ నగరానికి సుమారు 23 టీఎంసీల నీటిని సరఫరా చేయాలని నిర్ణయిస్తే వైసీపీ ఆటకెక్కించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూర్ఖుడి దగ్గర అధికారం ఉంటే, రాష్ట్రానికి ఎంత నష్టమో పోలవరం ఓ ఉదాహరణ.. By E. Chinni 08 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చాలా చక్కగా మాట్లాడారు: ఎంపీ రఘురామ వైసీపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చాలా చక్కగా మాట్లాడారన్నారు. పోలవరం, ప్రత్యేక హోదా, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కానీ.. సినిమా వాళ్ల గురించి మీకెందుకు అని బాగా గడ్డి పెట్టారని వ్యాఖ్యానించారు. మెగాస్టార్ వైసీపీ సర్కార్ కి బుద్ధి వచ్చేలా మాట్లాడారని.. చిరంజీవి మాటలు ప్రశంసనీయం అంటూ కొనియాడారు ఎంపీ రఘురామ కృష్ణం రాజు. అలాగే పలు అంశాలను ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించారు రఘురామ. వలంటీర్ల అరాచకాలు ఎక్కువయ్యాయని.. వలంటీర్లకు నాయకుడు సీఎం జగన్ అని పేర్కొన్నారు. By E. Chinni 08 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చిరంజీవి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కొడాలి నాని సినిమా ఇండస్ట్రీలో చాలామంది పకోడీ గాళ్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. వారు ప్రభుత్వం ఎలా ఉండాలో సలహాలు ఇస్తున్నారని నాని ఎద్దేవా చేశారు. మనం డాన్స్ లు, ఫైట్స్, యాక్షన్ గురించి చూసుకుందామని చెప్పొచ్చు కదా అని చిరుకి కౌంటర్ ఇచ్చారు. మెగాస్టార్ గారు మాకు కాకుండా.. ఆ ఇద్దరికీ సలహాలు ఇస్తే బాగుంటుందని పేర్కొన్నారు. వాళ్లకు కూడా 'ప్రభుత్వం గురించి మనకెందుకు' అని సలహాలు ఇవ్వొచ్చు కదా.. By E. Chinni 08 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కొడాలి నానికి పేమెంట్ ఇస్తేనే మీడియా ముందుకు వస్తాడు: బుద్ధా వెంకన్న గంజాయి మత్తులో కొడాలి నాని ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదని విమర్శించారు. గంజాయి తాగిన నాని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. కొడాలి నాని మనస్తత్వం నక్క లాంటిది అని ధ్వజమెత్తారు. కొడాలి నాని ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలి అని వార్నింగ్ ఇచ్చారు. మాజీ మంత్రి కొడాలి నాని వ్యవహార శైలి నచ్చకనే తెలుగుదేశం పార్టీ నుండి బయటకు పంపినట్లు తెలిపారు. నానికి పేమెంట్ ఇస్తేనే మీడియా ముందుకి వచ్చి మాట్లాడతాడంటూ ఆరోపణలు చేశారు. కొడాలి నాని ఎన్టీఆర్ కుటుంబంలో తగువులు సైతం పెట్టారని మండిపడ్డారు. By E. Chinni 08 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఈసారి కూడా నాకు అవకాశం కల్పించండి: ఎమ్మెల్యే కోటంరెడ్డి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. వైసీపీ నుంచి తాను దూరంగా జరిగి తెలుగు దేశం పార్టీలోకి ఎందుకు చేరాలో స్థానిక ప్రజలకు ఎమ్మెల్యే వివరించారు. ఇప్పటికే తనపై నమ్మకంతో రెండు సార్లు గెలిపించారని ఇందుకు రుణపడి ఉంటానన్నారు. గెలిచినప్పటి నుంచి నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశానని ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు. By E. Chinni 08 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'బిగ్ బాస్-7'లోకి నిహారిక క్లోజ్ ఫ్రెండ్.. అత్తతో రచ్చ చేస్తాడా? నిఖిల్ షోలతో పాటు పలు చిత్రాల్లో కూడా నటించాడు. దీంతో ఈ కుర్రాడి కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. నిహారికా కొణిదెలకు క్లోజ్ ఫ్రెండ్ అయిన అతడికి గతంలోనూ ఆఫర్ వచ్చింది. అయితే ఏవో కారణాలతో రాలేకపోయాడు. దీంతో ఈ సీజన్ లో నిఖిల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. అలాగే నిఖిల్ కి బిగ్ బాస్ నిర్వాహకులు భారీ మొత్తం ఆఫర్ చేశారని మరో టాక్ కూడా వినిపిస్తుంది. నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 7లోకి ఎంట్రీ ఇవ్వడం దాదాపుగా ఖాయం అనే టాక్ సోషల్ మీడియాలో.. By E. Chinni 08 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వరదల్లో ఎస్ఐ సాహసోపేత రెస్య్కూ ఆపరేషన్.. మెడల్ కి సిఫార్సు చేసిన ఏపీ సీఎం స్థానిక ఎస్ఐ వెంకటేష్ రెస్క్యూ ఆపరేషన్ సాహసోపేతంగా నిర్వహించారని, గత ఏడాది భీకరంగా వచ్చిన గోదావరి వరదల్లో కూనవరం సమీపంలోని దాదాపు 4-5వేలమంది గ్రామస్తులను తరలించడంలో కీలక పాత్ర పోషించారని సీఎం ఎదుటే స్థానికులు మెచ్చుకున్నారు. చాలా మంది ప్రాణాలను ఎస్ఐ కాపాడాలరని కొనియాడారు. స్థానికుల స్పందనతో సమానంగా సీఎం జగన్ కూడా స్పందించారు. గత ఏడాది, ఈ ఏడాది వచ్చిన గోదావరి వరదల్లో సాహసోపేతంగా రెస్యూ ఆపరేషన్స్ నిర్వహించిన కూనవరం ఎస్ఐను ముఖ్యమంత్రి అభినందించారు. By E. Chinni 08 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn