Pawan Kalyan Meeting with Party Leaders in Vizag: పార్టీ ముఖ్య నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం అంతర్గత సమావేశం కానున్నారు. రుషి కొండ, ఎర్రమట్టి కొండలు సహా వివాదాస్పద భూములకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా ఈ సమావేశంలో జనసేనాని చర్చించనున్నారు. అలాగే వైజాగ్ లో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. అయితే పవన్ ఫీల్డ్ విజిట్స్ పై ఉత్కంఠ నెలకొంది. ముందస్తు సమాచారం, అనుమతి లేకుండా పవన్ కళ్యాణ్ ఎక్కడికీ వెళ్ల రాదని ఆంక్షలు విధించారు పోలీసులు. అలాగే వైజాగ్ లో వారాహి విజయోత్సవ రెండో రోజు పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ను జనసేన టీమ్ రిలీజ్ చేయనుంది. ఇక విశాఖ పర్యటనలో పలువురు పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Pawan Kalyan: పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ అంతర్గత భేటీ.. వీటిపైనే చర్చ!!
పార్టీ ముఖ్య నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం అంతర్గత సమావేశం కానున్నారు. రుషి కొండ, ఎర్రమట్టి కొండలు సహా వివాదాస్పద భూములకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా ఈ సమావేశంలో జనసేనాని చర్చించనున్నారు. అలాగే వైజాగ్ లో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. అయితే పవన్ ఫీల్డ్ విజిట్స్ పై ఉత్కంఠ నెలకొంది. ముందస్తు సమాచారం, అనుమతి లేకుండా పవన్ కళ్యాణ్ ఎక్కడికీ వెళ్ల రాదని ఆంక్షలు విధించారు పోలీసులు. అలాగే వైజాగ్ లో వారాహి విజయోత్సవ రెండో రోజు పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ను జనసేన టీమ్ రిలీజ్ చేయనుంది.
Translate this News: