సాగునీటి ప్రాజెక్టులను వైసీపీ సర్కార్ నీరు గారుస్తోంది: చంద్రబాబు ఫైర్ టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై.. యుద్ధభేరి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. 9వ రోజు ఉమ్మడి విజయనగరం జిల్లాలో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి రిజర్వాయర్ ను చంద్రబాబు సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం అనేక సాగునీటి ప్రాజెక్టులను నీరు గారుస్తోందని దుయ్యబట్టారు. సీఎం జగన్ వల్ల ఎన్నో నీటి ప్రాజెక్టులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. అవే పూర్తి అయి ఉంటే.. ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ ఎంతో అద్భుతంగా ఉండేదన్నారు చంద్రబాబు. By E. Chinni 10 Aug 2023 in ఆంధ్రప్రదేశ్ విజయనగరం New Update షేర్ చేయండి టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై.. యుద్ధభేరి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. 9వ రోజు ఉమ్మడి విజయనగరం జిల్లాలో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి రిజర్వాయర్ ను చంద్రబాబు సందర్శించి, పరిశీలించారు. విజయనగరం నుంచి బొబ్బిలి, పార్వతీపురంల మీదుగా కురుపాం నియోజకవర్గంలో తోటపల్లి రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు. చంద్రబాబు అడుగడుగునా గజమాలలతో తెలుగుదేశం శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ సర్కార్ సాగునీటి ప్రాజెక్టులపై అనుసరిస్తున్న ధోరణిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం అనేక సాగునీటి ప్రాజెక్టులను నీరు గారుస్తోందని దుయ్యబట్టారు. సీఎం జగన్ వల్ల ఎన్నో నీటి ప్రాజెక్టులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. అవే పూర్తి అయి ఉంటే.. ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ ఎంతో అద్భుతంగా ఉండేదన్నారు. అలాగే తమపై, టీడీపీ నేతలపై లేని పోని కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోవాలని చంద్రబాబు సూచించారు. కాగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని సాగు నీటి ప్రాజెక్టులను సర్వనాశనం చేసిందని ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రానికీ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ కి నీటి వనరులు ఉన్నాయని చెప్పారు చంద్రబాబు. నదులు అనుసంధానం చేస్తే ప్రతి ఎకరాకు నీరు ఇవ్వొచ్చన్నారు. నీటిపారుదల శాఖను నాశనం చేసిన వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ సీమకు తీరని ద్రోహం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. కృష్ణ, గోదావరి నదుల అనుసంధానం వల్ల రాష్ట్రానికి మేలు కలుగుతుందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. కాగా అన్నమయ్య జిల్లా అంగళ్లులో ఇటీవల జరిగిన ఘర్షణలపై టీడీపీ అధినేత చంద్రబాబుపై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఉమాపతి రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముదివీడు పోలీస్ స్టేషన్ లో చంద్రబాబు సహా మరికొంత మంది టీడీపీ నేతలపై, కార్యకర్తలపై కేసులు నమోదు అయ్యాయి. దీనిపై ఇప్పటికే ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి స్పందించారు. రాష్ట్రంలోని పోలీసుల తీరు దారుణంగా ఉందని.. వైసీపీ నాయకులు చేసిన దాడులకు టీడీపీ నేతలపై కేసులు పెడ్తున్నారని రాంగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటనలు కొనసాగుతున్నాయి. #ycp-government #vizianagaram #chandrababu #sensational-comments #tdp-chief-chandrababu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి