Brain Tips : సమస్యలు, ఆందోళనలు లేకుండా ఎవరూ ఉండలేరు. కుటుంబ బాధ్యత మీద పడ్డప్పుడు ఇవి మరింత ఎక్కువవుతాయి. ఉద్యోగం(Job), వ్యాపారం(Business) ఇలా వీటి గురించే ఆలోచిస్తూ కాలం వెల్లదీస్తుంటారు. ఇలాంటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామందికి ప్రశాంతంగా ఆలోచించే పరిస్థితి లేదు. ఎన్నో రకాల ఆలోచనలతో మన మెదడు(Brain) లో ఎప్పుడూ మోథోమదనం. సంఘర్షణలు చెలరేగుతూనే ఉంటాయి. అయితే మెదడుకు తగినంతగా విశ్రాంతి కల్పించడం కీలకమని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
Also Read : మేకప్ బ్రషెస్ ఇలా వాడారో.. మీ అందం పాడైనట్లే
మానసిక సమస్యలు
మెదడుకు మనం ఎల్లప్పుడు చేరవేసే సమాచారం, దానికి చెప్పే పనులు చివరికి మానసిక సమస్యలకు దారితీస్తాయి. కంప్యూటర్ కూడా 24 గంటలు డేటాను ప్రాసెస్ చేయదు. అందుకే మెదడుకు తప్పకుండా కాస్త విశ్రాంతి ఇవ్వాలని నిపుణలు సూచిస్తున్నారు. మన మెదడుకు తరచూ విరామం ఇస్తుంటే.. అది మరింత యాక్టివ్‌గా పనిచేస్తూ.. సృజనాత్మకంగా వ్యవహరిస్తుందని లెక్సిస్‌నెక్సిస్ అనే సర్వే తెలిపింది.
ఇలా చేస్తే మెదడు చురుకగా
అయితే మెదడుకు విశ్రాంతి(Break to Brain) ఇవ్వడమంటే.. అది పూర్తిగా పని ఆపేసినట్లు కాదని నిపుణులు చెబుతున్నారు. బ్రైన్‌లోని కొన్ని భాగాలకు తక్కువ పని కల్పించడమే మెదడుకు విరామం ఇవ్వడమని అంటున్నారు. మెదడుకు విశ్రాంతి కల్పిస్తూ.. అది చరుకుగా పనిచేసేందుకు పలు సూచనలు చెబుతున్నారు. రోజుకు 7-8 గంటల నిద్ర, శారీరక వ్యాయామం చేయడం, ఆరోగ్యకమనైన ఆహారం తీసుకోవడం, మెదడుకు విరామం ఇవ్వడం, డిజిటల్ గ్యాడ్జెట్స్‌కు దూరంగా ఉండటం, నలుగురితో కలవడం లాంటివి చేయాలని సూచిస్తున్నారు.
Also Read: డయాబెటిస్ రాకూడదంటే.. ఈ మూడు విషయాలపై జాగ్రత్త అవసరం