Mathura: శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు.. సర్వేకు బ్రేక్‌ ఇచ్చిన ధర్మాసనం

యూపీలోని మథురలో శ్రీకృష్ణ జన్మవివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ ఆలయం వద్ద ఉన్న షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపేస్తూ తీర్పు వెలువరించింది. మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్లపై స్పందించాలంటూ హిందూ సంఘాలను ఆదేశించింది.

New Update
Supreme Court : వెనుకబడిన వర్గాలపై రాష్ట్ర ప్రభుత్వాలు వివక్షచూపించకూడదు : సుప్రీంకోర్టు

ఉత్తరప్రదేశ్‌లో మథురలో కృష్ణ జన్మభూమి వివాదంపై మంగళవారం సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ ఆలయం వద్ద ఉన్న షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపేస్తూ తీర్పు వెలువరించింది. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్లపై తమ స్పందన తెలియజేయాలంటూ హిందూ సంఘాలకు ఆదేశాలు జారీ చేసింది.

Also read: అయోధ్యలో భక్తుల కోసం కొత్త యాప్.. ఎందుకంటే..

ఇక వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని మథురలో శ్రీకృష్ణుడు జన్మించిన స్థలంలో షాహీ ఈద్గాను నిర్మించారని ఆరోపిస్తూ.. దీనిపై సర్వే చేయించాలని మథుర జిల్లా కోర్టులో గతంలో 9 పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ఇవి చాలాకాలం పాటు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో వాటిని మథర జిల్లా కోర్టు అలహాబాద్‌ ఉన్నతన్యాయస్థానానికి బదిలీ చేశారు. గత ఏడాది డిసెంబర్‌లో హైకోర్డు ఈ అంశంపై విచారణ జరిపింది. చివరికి కోర్టు పర్యవేక్షణలో షాహీ ఈద్గాలో సర్వే నిర్వహించేందుకు.. అలాగే ఆ సర్వే పర్యవేక్షనకు అడ్వొకేట్‌ కమిషనర్‌ను నియమించడానికి అనుమతులు ఇచ్చింది.

అలహాబాద్ హైకోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముస్లిం కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజాగా ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. హైకోర్టు ఆదేశాల అమలుపై స్టే ఇచ్చింది. అలాగే హిందూ సంఘాలకు నోటీసులు జారీ చేసింది. ఈ వివాదంపై హైకోర్టు ఎదుట విచారణ కొనసాగుతుందని తీర్పునిచ్చింది.

Also read: అయోధ్యకు, భద్రాచలం రామాలయానికి మధ్య నాకు ఎలాంటి తేడా కనిపించడం లేదు- సీఎం

Advertisment
తాజా కథనాలు