Revanth Reddy About SC Classification: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రెండు వర్గాల్లో ఉన్న జనాభా దామాషా ప్రకారం విభజన చేస్తామన్నారు. కేసీఆర్కు (CM KCR) ఎస్సీ వర్గీకరణపై కేంద్రంతో కొట్లాడే ధైర్యం లేదని మండిపడ్డారు. ఎప్పటికైనా ఎస్సీ వర్గీకరణ చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే (Congress Govt) అన్నారు. ఏ ఒక్కరి కోసమో వర్గీకరణ చేయడం లేదన్న ఆయన.. రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ప్రజల కోసం చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ పట్ల కాంగ్రెస్ చిత్త శుద్ధితో ఉందని, ఎవరూ చింతించాల్సిన అవసరంలేదన్న ఆయన.. ఒకరికి మద్దుతు ఇచ్చి ఇంకొకరిని ప్రశ్నించడం సరికాదన్నారు.గతంలోనే ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని రాహుల్ గాంధీ (Rahul Gandhi) చెప్పారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. , రిజర్వేషన్ సీట్లలో కాకుండా జనరల్ సీట్లలో దళిత గిరిజనులకు అవసరాన్ని బట్టి సీట్లు కూడా ఇస్తామని రేవంత్ రెడ్డి వివరించారు.
పూర్తిగా చదవండి..Revanth Reddy: ఎస్సీ వర్గీకరణ పంచుతాం.. పంచాయతీ తెంచుతాం
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రెండు వర్గాల్లో ఉన్న జనాభా దామాషా ప్రకారం విభజన చేస్తామన్నారు. కేసీఆర్కు ఎస్సీ వర్గీకరణపై కేంద్రంతో కొట్లాడే ధైర్యం లేదని మండిపడ్డారు.
Translate this News: