AP Govt Jobs: ఏపీలో భారీగా పెరిగిన గ్రూప్-2 జాబ్స్.. జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు..!!

ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. గ్రూపు-2లో అదనంగా 212 పోస్టులను పెంచుతూ సర్కార్ జీవోను విడుదల చేసింది. గతంలో గ్రూప్ -2లో 508పోస్టుల భర్తీకి సర్కార్ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. పోస్టుల సంఖ్య పెంచాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేయడంతో సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. పరిశీలన అనంతరం 212 పోస్టుల పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
APPSC Jobs: ఏపీలోని నిరుద్యోగులను అదిరిపోయే శుభవార్త.. ఏపీపీఎస్సీ నుంచి 6 నోటిఫికేషన్లు!

ఏపీలోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఏపీపీఎస్సీ గ్రూప్-2 పోస్టుల విషయంలో నిరుద్యోగులు నిరుత్సాహంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టు నెలలో గ్రూప్-2లో 508 పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే గ్రూప్-2 పోస్టుల సంఖ్యను పెంచాలంటూ చాలా మంది అభ్యర్థులు ఎపీపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు. పోస్టుల సంఖ్య పెంచాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేయడంతో సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. పరిశీలన అనంతరం 212 పోస్టుల పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఏపీపీఎస్సీ 720 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది.

ఇది కూడా చదవండి: 50 మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్ ఇదే.. ఆఖరి నిమిషంలో ఊహించని మార్పులు!

ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల ఎంపిక ప్రక్రియతోపాటు పరీక్ష విధానం, సిలబస్ విశ్లేషణ, ప్రిపరేషన్ గైడెన్స్ తదితర వివరాలను త్వరలోనే ప్రకటించనుంది. మరికొన్ని రోజుల్లోనే గ్రూప్ 1, 2 నోటిఫికేషన్స్ రావడం ఖాయమని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ప్రిపరేషన్ ప్రారంభించే ముందు అభ్యర్థులు సిలబస్ పై పూర్తి అవగాహన ఏర్పరుచుకోవాలి. తాము పోటీ పడుతున్న పరీక్షకు సంబంధించిన సిలబస్ ను మరింత లోతుగా పరిశీలించాలి. గత ప్రశ్నలను ఓసారి అధ్యయనం చేయాలి. తర్వాతే ప్రిపరేషన్ ప్లాన్ డిజైన్ చేసుకోవాలి.

ఇది కూడా చదవండి: రైతులకు తెలంగాణ సర్కార్ శుభవార్త.. రుణమాఫీపై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన!

పరీక్ష విధానం ఈవిధంగా ఉంటుంది:
గ్రూప్ 2 పరీక్షను రెండు దశలుగా నిర్వహించనున్నారు. పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష జరుగుతుంది. మొదటి దశలో 150 మార్కులతో స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారికి 1:50నిష్పత్తిలో రెండో దశ మెయిన్ పరీక్షకు సెలక్ట్ చేస్తారు. మెయిన్ లో ఒక్కో పేపర్ కు 150 మార్కులు ఉంటాయి. ఇలా రెండు పేపర్లు ఉంటాయి. ఈ పరీక్ష పూర్తి ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది.

Advertisment
తాజా కథనాలు