టీడీపీ పొలిట్ బ్యూర్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్ లోఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లోపు మిగిలిన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఇప్పటివరకు రైతులకు రెండుసార్లు రుణమాఫీ చేశామన్న కేటీఆర్..రైతుబంధు కింద రూ. 73వేల కోట్లు ఖాతాల్లో వేశామన్నారు. 13లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మీ అందించామన్నారు. మళ్లీ బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వస్తే రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
పూర్తిగా చదవండి..TS Farmers: రైతులకు తెలంగాణ సర్కార్ శుభవార్త.. రుణమాఫీపై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన!
రుణమాఫీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లోపు మిగిలిన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ఆయన ప్రకటించారు. ఇప్పటివరకు రైతులకు రెండుసార్లు రుణమాఫీ చేశామన్న కేటీఆర్..రైతుబంధు కింద రూ. 73వేల కోట్లు ఖాతాల్లో వేశామన్నారు. 13లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మీ అందించామన్నారు. మళ్లీ బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వస్తే రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
Translate this News: