Movies:ఓటీటీల్లోనూ దమ్ముదులుపుతున్న సలార్

డార్లింగ్ ప్రభాస్ సలార్ మూవీ డిసెంబర్ 22న థియేటర్స్ లోకి వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 730 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఓటీటీలో కూడా రిలీజ్ అయి దుమ్ము లేపుతోంది.

New Update
Movies:ఓటీటీల్లోనూ దమ్ముదులుపుతున్న సలార్

Salaar movie:ప్రశాంత్ నీల్ వరల్డ్ నుంచి వచ్చిన సినిమా సలార్. కేజీఎఫ్ తరువాత ఈ సినిమా వచ్చింది. ముందు నుంచీ దీని మీద భారీగానే అంచనాలున్నాయి. బాహుబలి తర్వాత.. ప్రభాస్ (Prabhas) నుంచి ఆ రేంజ్ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు సలార్ తో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ ఇచ్చారు డార్లింగ్. బాహుబలి (Baahubali), కేజీఎఫ్ (KGF) రికార్డులను బ్రేక్ చేయడానికి సలార్ సిద్ధంగా ఉంది. విడుదలైన మొదటి రోజు నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ రేంజ్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది సలార్. ఫస్ట్ డే 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను చేసింది. తర్వాత మొత్తంగా 730 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

Also read:రాముడితో పాటూ రావణుడూ ట్రెండింగ్..

ఇప్పుడు ఓటీటీలో కూడా అదే హవా...
డిసెంబర్ 22 న సలార్ మూవీ విడుదల అయితే జనవరి 20న ఇది ఓటీటీల్లోకి వచ్చేసింది. అదేంటీ అంత తొందరగా వచ్చేసింది అనుకున్నారు. అందరూ. కానీ ఇప్పుడు ఇదే సినిమా ఓటీటీలో కూడా దుమ్ములేపుతోంది. ఆన్‌లైన్‌లో కూడా జనాలు సలార్ సినిమాను విరగబడి చూస్తున్నారు. నాలుగు రోజుల్లోనే మిలియన్ వ్యూస్ వచ్చాయని చెబుతున్నారు.

రెడీ అవుతున్న రెండో పార్ట్…

ఖాన్సార్ అనే ఒక సెపరేట్ రాజ్యం…అందులో గొడవలు ఆధారంగా తీసిన సలార్ మూవీ ఫుట్ టూ యాక్షన్ ఎంటర్‌టైనర్. ప్రశాంత్ నీల్ టేకింగ్, ప్రభాస్ మాస్ యాక్షన్ ఈ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్ళాయి. ఇందులో డార్లింగ్‌తో పాటూ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంపార్టెంట్ రోల్ పోషించారు. శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా చేయగా ఈశ్వరిరావు, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా రెండో పార్ట్ కూడా త్వరలోనే విడుదల కాబోతోంది. దీని షూటింగ్ ఇప్పటికే దాదాపు 50 శాతం పూర్తి చేసుకుందని మేకర్స్ చెబుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు