Sajjala Ramakrishna Reddy: పొత్తులో భాగంగా టీడీపీ జనసేన పార్టీలు ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించడంపై ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారని పేర్కొన్నారు. పవన్ ను చూస్తే జాలి వేస్తోందని అన్నారు. రాజకీయ పార్టీని నడిపే సత్తా పవన్ కళ్యాణ్ కు లేదని విమర్శించారు. అత్యంత దయనీయ స్థితిలో పవన్ ఉన్నారని వ్యాఖ్యానించారు. జనసేన పోటీ చేసే 24 సీట్లల్లో కూడా ఉన్నది చంద్రబాబు అభ్యర్థులే అని పేర్కొన్నారు. జనసేనను మింగేసి చంద్రబాబు ప్రయోజనం పొందాలని చూస్తున్నారని ఆరోపణలు చేశారు. పవన్ ను అభిమానించే వారు ఒకసారి ఆలోచించుకోవాలని అన్నారు. 175 స్థానాల్లో పోటీకి నిలబెట్టేందుకు చంద్రబాబుకు అభ్యర్థులు లేరని చురకలు అంటించారు. పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీ ఉపాధ్యక్ష పదవి తీసుకొని పనిచేయాలని సెటైర్లు వేశారు. 24 మందితో పవన్ కళ్యాణ్ వైసీపీ పై యుద్ధం చేస్తారా? అని ప్రశ్నించారు. టీడీపీ, జనసేనవి దింపుడు కళ్లెం ఆశలు అని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని సీట్లల్లో పోటీ చేసిన తమకు ఎలాంటి ఇబ్బంది లేదని.. ఏపీలో అధికారంలోకి వచ్చేది వైసీపీ అని ధీమా వ్యక్తం చేశారు.
99 మందితో ప్రకటన..
ఏపీలో రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగబోయే టీడీపీ-జనసేన అభ్యర్థుల మొదటి జాబితా విడుదలైంది. ఉండవల్లి వేదికగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మొదటి గెలుపు గుర్రాలను ప్రకటించారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఈ రోజు మాగా పౌర్ణమి. శుభ ముహూర్తం. రాష్ట్ర భవిష్యత్ కోసం, రాష్టాన్ని కాపాడుకోవడం కోసం ఈ కలయిక. దీనిపై అనేక సార్లు మాట్లాడుకొన్నామన్నారు. జనసేన 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. తెలుగు దేశం 94 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేయనుందని తెలిపారు. బీజేపీ కలిసివస్తే తగిన నిర్ణయాలు, తగిన సమయంలో తీసుకొంటామన్నారు. అలాగే జనసేన ఎన్నికల్లో పోటీ చేసే ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది. మరికొన్ని రోజుల్లో మిగితా స్థానాల అభ్యర్థులను ప్రకటిస్తామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలిపారు.
ALSO READ: టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్ రిలీజ్..!
DO WATCH: