Sajjala Ramakrishna Reddy: పవన్ కళ్యాణ్‌ టీడీపీని టేకోవర్‌ చేసుకున్నారు

టీడీపీ-జనసేన పార్టీలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణ రెడ్డి ట్రిబ్యుషనల్‌ సమీక్ష అంశాన్ని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్నారు. టీడీపీ నేతలు దీనిపై రాజకీయ విమర్శలు చేస్తున్నారన్న ఆయన.. సోమవారమే కృష్ణ ట్రిబ్యుషన్‌ సమీక్ష అంశం వచ్చిందన్నారు.

New Update
Sajjala: ఏం తప్పుగా మాట్లాడాను?.. చిరంజీవి గొప్ప నటుడే.. కానీ..!

టీడీపీ-జనసేన పార్టీలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణ రెడ్డి ట్రిబ్యుషనల్‌ సమీక్ష అంశాన్ని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్నారు. టీడీపీ నేతలు దీనిపై రాజకీయ విమర్శలు చేస్తున్నారన్న ఆయన.. సోమవారమే కృష్ణ ట్రిబ్యుషన్‌ సమీక్ష అంశం వచ్చిందన్నారు. కృష్ణా జలాల అంశాన్ని తిరగతోలడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్‌తో ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం నిర్వహించాల్సి ఉందన్నారు. మరోవైపు టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన సజ్జల.. తెలుగు దేశం పార్టీ బలహీన పడిందని పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు ఒప్పుకున్నట్లేనా అని ప్రశ్నించారు.

టీడీపీని పవన్‌ కళ్యాణ్‌ టేకోవర్‌ చేసుకున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పవన్‌ జనసేనతో పాటు టీడీపీకి సైతం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీని టేకోవర్‌ చేసుకున్న పవన్‌ కళ్యాణ్‌ రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఎన్ని సీట్లు ఇస్తున్నారో చెప్పాలన్నారు. సీఎం జగన్‌ ఢీల్లీ టూర్‌పై అసత్య ప్రచారం జరుగుతుందన్న ఆయన.. చంద్రబాబు కేసుల గురించి జగన్‌ కేంద్రం పెద్దలతో మాట్లాడటానికి వెళ్లారని విపక్ష నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. జగన్‌ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్లారన్న సజ్జల.. చంద్రబాబు కేసుల గురించి మాట్లాడే అవసరం జగన్‌కు ఏముందన్నారు.

రాష్ట్రానికి సంబంధించిన ఆంశాల గురించి సీఎం కేంద్రం పెద్దలతో మాట్లాడారని సజ్జల రామృష్ణా రెడ్డి తెలిపారు. చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్ పరారీలో ఉన్నరని సజ్జల రామకృష్ణారెడ్డి.. శ్రీనివాస్‌ త్వరగా తిరిగి వస్తే చంద్రబాబు కేసు తేలుతోందని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు తన మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ను త్వరగా తిరిగి రమ్మని చెప్పాలన్నారు. బాబు కేసులో ఆయన తరపు లాయర్లు టెక్నికల్ అంశాల పైనే మాట్లాడుతున్నారని సజ్జల రామృష్ణా రెడ్డి వెల్లడించారు. వైఎస్‌ మరణాన్ని, సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిని టీడీపీ-జనసేన నేతలు చిన్న పిల్లలతొ తిట్టించడం దారుమన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు