YSR : వైఎస్సార్‌ మరణంపై అనుమానాలు ఉన్నాయి.. సజ్జల సంచలన కామెంట్స్

వైఎస్సార్ మరణం పట్ల అనుమానాలు ఉన్నాయని సజ్జల రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు. చంద్రబాబు తనకేం కావాలో అందరితో కలిసి చేయిస్తాడని అన్నారు.

Sajjala: సజ్జలకు బిగ్ షాక్.. సీఐడీకి ఫిర్యాదు!
New Update

Sajjala Rama Krishna Reddy : మరి కొన్ని నెలల్లో ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) లో అసెంబ్లీ ఎన్నికలు(AP Elections) జరగనున్న వేళ వైసీపీ(YSRCP) ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి(Sajjala Ramakrishna Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhara Reddy) మరణంపై కాంగ్రెస్‌కు(Congress) సంబంధించి ఆరోజు నుంచే అనుమానాలు ఉన్నాయని అన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌ కలిసే జగన్‌పై తప్పుడు కేసులు పెట్టాయని ఆరోపించారు. కాంగ్రెస్‌తో ఎప్పుడూ చంద్రబాబు కంటాక్ట్‌లో ఉంటున్నారని అన్నారు.

ALSO READ: ఇస్రో రికార్డ్.. ఆదిత్య ఎల్-1 సక్సెస్

ఇది చంద్రబాబు కుట్ర..

షర్మిల(YS Sharmila) కాంగ్రెస్ పార్టీలో చేరడంపై సజ్జల రామకృష్ణ స్పందించారు. షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు. షర్మిల రాజకీయంగా ఎక్కడనుంచైనా ప్రాతినిధ్యం వహించొచ్చు అని అన్నారు. షర్మిల వల్ల YSRCPకి ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే నష్టం ఏమీ ఉండదని అన్నారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వెనుక చంద్రబాబు ఉన్నారని అన్నారు.

టీడీపీ నేతలో బ్రదర్ అనిల్..

టీడీపీ నేతలతో గత కొన్ని రోజలుగా షర్మిల భర్త బ్రదర్ అనిల్ టచ్ లో ఉన్నారని సజ్జల అన్నారు. సీఎం రమేష్‌కు సంబంధించిన సొంత విమానంలో షర్మిల, బ్రదర్‌ అనిల్‌ వెళ్లారని తెలిపారు. ఎయిర్‌పోర్టులో బీటెక్ రవి, బ్రదర్ అనిల్ కుమార్ భేటీ అయ్యారని అన్నారు. టీడీపీ(TDP) నేత బీటెక్ రవి(B.Tech Ravi) ని... బ్రదర్ అనిల్‌ కలవడం ఇవన్నీ అందులో బాగమే అని సజ్జల పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదు..

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీని మేము పట్టించుకోము, పట్టించుకునే పరిస్థితులు కూడా లేవు అని పేర్కొన్నారు. ప్రజలా? కుటుంబమా? అనే ప్రశ్న వస్తే ముఖ్యమంత్రి ఛాయిస్ ప్రజలే అని అన్నారు. రాజకీయాల్లో కుటుంబానికి ప్రాధాన్యత ఉండకూడదు అంటూనే మళ్లీ ఇదే వాదన ఎందుకుతీసుకొస్తున్నారు? అని ప్రశ్నించారు. కుటుంబం కోసం సీఎం జగన్ YSRCPని పెట్టలేదని.. ఒక పార్టీగా మా విధానాలు మాకు ఉన్నాయని తేల్చి చెప్పారు.

Also Read : 300ఏళ్ళు బతికే రోజు దగ్గరల్లోనే ఉంది..ఇస్రో ఛైర్మన్

#ycp #chandrababu #ap-elections-2024 #cm-jagan #sajjala-ramakrishna-reddy #ap-breaking-news #sharmila-into-congress-party
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe