ఇంఛార్జిల మార్పు, షర్మిల రాకపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

ఇంఛార్జిల మార్పు, ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ పై సజ్జల రామకృష్ణ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు సిట్టింగులను మార్చడం సాధారణ ప్రక్రియ అని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన తాను సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

New Update
Sajjala Ramakrishna Reddy: మాకు టార్గెట్ క్లియర్‌గా ఉంది.. చంద్రబాబు సజ్జల స్వీట్ వార్నింగ్!

Sajjala Comments: ఇంఛార్జిల మార్పు, ఏపీ రాజకీయాల్లోకి షర్మిల రాకపై ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంఛార్జిల మార్పులతో కొంతమంది బాధ, ఆవేదన ఉంటుందని అన్నారు. రాబోయే రోజుల్లో అన్ని సర్దుకుంటాయని తెలిపారు. గత ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పి అధికారంలోకి వచ్చామో అదే చేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో వచ్చినప్పుడు బాధ్యతగానే పని చేశామని వెల్లడించారు. ఎమ్మెల్యేలకు, ఇంఛార్జిలను సీటు ఇవ్వమని సీఎం జగన్ ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. ప్రజల్లోకి వెళ్ళాలని, ప్రజల మద్దతు పొందాలని సీఎం జగన్ (CM Jagan) చెప్పారని తెలిపారు. సిట్టింగ్ లు మార్పులు అనేది ఎన్నికలు ముందు జరిగే సాధారణ ప్రక్రియ అని వైసీపీ నాయకులకు క్లారిటీ ఇచ్చారు.

ALSO READ: పార్లమెంట్ లో దాడి.. లోక్ సభ స్పీకర్ కీలక నిర్ణయం!

దానిపై ప్రతిపక్షాలు ఏదోదో మాట్లాడుతున్నాయని ఫైర్ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. నోటిఫికేషన్ కోసం మేము ఎదురు చూడడం లేదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోసారి వైసీపీ ప్రభుత్వానికి అధికారం కట్టబెడుతారని ధీమా వ్యక్తం చేశారు.

అభ్యర్థులు లేక ప్రతిపక్ష నేతలు ఏవేవో మాట్లాడతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో టీడీపీ (TDP), జనసేన (Janasena) అసలు పొత్తులో ఉందా? అని ప్రశ్న వేశారు. ఒక మీటింగ్ పెట్టుకున్నారు.. తరవాత ఇరు పార్టీలు కొట్టుకున్నారని సెటైర్లు వేశారు. చంద్రబాబు (ChandraBabu) ఉన్నపలంగా బలం వచ్చేసిందా?.. అనారోగ్యం అంటూ గగ్గోలు పెట్టిని చంద్రబాబు ఇప్పుడు పార్టీ మీటింగ్ లు అంటూ హడావుడి చేస్తున్నారని విమర్శించారు.

చంద్రబాబు కోసం హైరానా పడ్డ భార్య, కోడలు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తెలంగాణలో పోటీ చేసి.. నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్నాడని చురకలు అంటించారు. ఎస్సీ నియోజకవర్గాల్లో ఎస్సీలనే పెట్టాం.. బీసీలను పెట్టామా? అని ప్రతిపక్ష నాయకులను ప్రశ్నించారు.

ALSO READ: BREAKING: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇదిలా ఉండగా ఏపీ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల (YS Sharmila) వస్తారనే దానిపై ఆయన స్పందించారు. సజ్జల మాట్లాడుతూ.. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారని అన్నారు. ఏపీ రాజకీయాల్లోకి వస్తారో లేదో ఆమె ఇష్టమని పేర్కొన్నారు. ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసేందుకు రాజ్యంగం హక్కు కల్పించిందని తెలిపారు. ఎన్ని పార్టీలు వచ్చినా వైసీపీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు సజ్జల.

#chandrababu #pawan-kalyan #ap-news #sajjala-ramakrishna-reddy #ys-sharmila
Advertisment
తాజా కథనాలు