Viral Video: ఏనుగు నుంచి సఫారీ జీప్ ఎస్కేప్..తృటిలో తప్పిన ప్రమాదం

మనం సఫారీ చూడ్డానికి వెళ్ళాం..అక్కడ ఓ పెద్ద ఏనుగును ఉన్నట్టుండి సడెన్‌గా మన మీదకు వచ్చింది..మనం ఉన్న జీపును పడేయడానికి చూసింది. ఊహించుకోవడానికే భయం వేస్తోంది కదూ..అదిగో సరిగ్గా అలాంటిదే జరిగింది ఓ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో. వివరాలు కింది ఆర్టికల్‌లో చదివేయండి.

Viral Video: ఏనుగు నుంచి సఫారీ జీప్ ఎస్కేప్..తృటిలో తప్పిన ప్రమాదం
New Update

Elephant Attacked On Safari Jeep: సఫారీ ట్రిప్‌లు..అడవుల్లో ఉన్న జంతువులను దగ్గరగా వెళ్ళేలా ఉంటే టూర్‌లు ఇవి. వీటి కోసం ప్రత్యేక సిబ్బంది, జీప్‌లు ఉంటాయి. దీని కోసం వచ్చే టూరిస్టులను అక్కడ సఫారీ సిబ్బంది జీపుల్లో తిప్పుతూ వన్యప్రాణులను దగ్గరగా చూపిస్తారు. నిజానికి ఇదొక థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్. అంతే ప్రమాదం కూడా. జంతువుల మంచిగా, ప్రశాంతంగా ఉన్నంతవరకు బాగానే ఉంటుంది. కానీ వాటికి చిరాకు వచ్చిందో అంతే సంగతులు. అందుకే సఫారీని చూపించే సిబ్బంది యానిమల్స్‌కు మరీ దగ్గరగా తీసుకుని వెళ్ళరు. వాటిని చూపిస్తున్నప్పుడు పెద్ద శబ్దాలు చేయడం, వాటి మీదకు వస్తువులు విసరడం లాంటివి చేయొద్దని ముందే చెబుతారు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అప్పుడప్పుడూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. జంతువులకు ఎప్పుడు, ఎందుకు చిరాకు వస్తుందో చెప్పడం కష్టం. వాటికి కోపం వచ్చిందంటే మాత్రం తట్టుకోవడం ఎవరి వల్లా కాదు.



ఇది ఎక్కడ జరిగిందో కచ్చితంగా తెలియదు కానీ...ఇండియాలో ఓ రిజర్వ్ పారెస్ట్‌లో జరిగిన సంఘటన తాలూకా వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి రమేష్ పాండే షేర్ చేశారు. పర్యాటకులతో నాలుగు సపారీ జీపులు రిజర్వ్ అడవిలో తిరుగుతున్నాయి. వాళ్ళు ఒక పెద్ద ఏనుగును చూస్తున్నారు. ఉన్నట్టుంది దానికేమయిందో తెలియదు కానీ...అది జీపుల మీదకు లంఘించింది. జీపును కాలితో కొడుతూ దాన్ని బోర్లా పడేయడానికి ప్రయత్నించింది. జీపులో ఉన్న వారికి కూడా హాని కలిగించడానికి చూసింది. కానీ మళ్ళీ ఏమనుకుందో పెద్దగా ఏమీ చేయకుండానే వెనక్కు వెళ్ళిపోయింది. కానీ కొన్ని నిమిషాల పాటూ మాత్రం అక్కడ ఉన్నవారందరికీ చుక్కలు చూపించింది. వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయేలా చేసింది.

ఈ సంఘటన తాలూకీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని కింద బోలెడు కామెంట్లు కూడా వస్తున్నాయి. మన నివాసాల్లోకి ఎవరైనా బలవంతంగా వస్తే ఎలా తిరగబడతామో...వన్యప్రాణులు కూడా అంతే చేస్తాయి అంటూ కామెంట్లు రాస్తున్నారు నెటిజన్లు. థాంక్ గాడ్ అంత పెద్ద ఏనుగు ఏమీ చేయకుండా వెళ్ళిపోయింది సంతోషించండి అని కూడా పెడుతున్నారు. జంతువులను వాటి స్థానాల్లో వాటిని ఉండనివ్వడం మంచిదని సూచిస్తున్నారు. వీడియోను బట్టి కార్బెట్ రిజర్వ్ ఫారెస్ట్‌లో సంఘటన జరిగి ఉండవచ్చని చెబుతున్నారు.

Also Read: మా అమ్మకోసమే.. సిద్ధార్థ్‌తో ఎంగేజ్ మెంట్ పై అదితి ఓపెన్!

#viral #video #safari #elephant #twitter
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe