Ganesh Nimajjanam: నిమజ్జనంలో విషాదాలు.. డ్యాన్స్ చేస్తూ ఒకరు మృతి.. నిమజ్జనం చేస్తూ తండ్రీకొడుకులు (వీడియోలు)

గణేష్‌ నవరాత్రులు పూజలు దేశ వ్యాప్తంగా పూర్తయ్యాయి. వైభవంగా గణేష్‌డి శోభాయాత్రలు కొనసాగుతోంది. ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. డీజే సౌండ్స్, డ్యాన్సులులతో బొజ్జగణపయ్య నిమజ్జనం రాష్ట్ర నలు మూలన సందడితో పాటు..అక్కడక్కడ అపశృతులు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంటున్నాయి.

Ganesh Nimajjanam: నిమజ్జనంలో విషాదాలు.. డ్యాన్స్ చేస్తూ ఒకరు మృతి.. నిమజ్జనం చేస్తూ తండ్రీకొడుకులు (వీడియోలు)
New Update

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతంలో గణేష్ నిమజ్జన వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. భద్రాచల పట్టణంలో నిమజ్జనం వేడుకల్లో బుధవారం రాత్రి అపశృతి జరిగింది. నిమజ్జనం సందర్భంగా టపాకాయలు పేలుస్తూండగా స్థానిక అంబేద్కర్ సెంటర్‌లో పలు దుకాణాలు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశారు. ఈ సంఘటనపై మర్వాక ముందే.. గోదావరి నదిలో నిమజ్జనానికి వెళ్లి నీటమునిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. నీటమునిగిన ముగ్గురిలో ఇద్దరిని కాపాడి ఒడ్డుకు చేర్చారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. గల్లంతైన మరో యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ యువకులు భద్రాద్రికొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

This browser does not support the video element.

చిత్తూరు జిల్లా పుంగనూరు వినాయక నిమార్జన ర్యాలీలో అపశృతి జరిగింది. హై స్కూల్ స్ట్రీట్‌లో ఓ ఇంటిముందు ఉన్న కారు దగ్ధం అయింది. భారీ బాణసంచా పేలుస్తూ వినాయకుడిని నిమార్జనానికి తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. టపకాయల నిప్పు రవ్వలు పడి కొత్త బ్రీజా కారు దగ్ధం అయింద.ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా వినాయక నిమజ్జనంలో అపశృతి జరిగింది. ఊరేగింపు సందర్భంగా యువకుల అత్యుత్సాహం ప్రదర్శించారు. స్టెప్స్ వేస్తూ ట్రాక్టర్‌పై నుంచి పల్టీ కొట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అదుపు తప్పి రోడ్డును తాకిన తల భాగానికి గాయం అయింది. దీంతో యువకుడికి తీవ్ర గాయాలై.. పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే తిరుపతి రూయా ఆస్పత్రికి తరలించారు.

This browser does not support the video element.

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగిన గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. రాత్రి 12:30 గంటల సమయంలో చిట్ట చివరగా భారీ గణేష్ విగ్రహాన్ని క్రేన్ ద్వారా నిమజ్జనం చేస్తుండగా భూమా చంద్రశేఖర్‌రెడ్డి (22) అనే యువకుడు నదిలో పడిపోయి గల్లంతయ్యాడు. నది నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో గల్లంతైన వ్యక్తి కోసం పోలీసులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటనతో పట్టణంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పల్నాడు జిల్లా వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ కృష్ణానదిలో‌పడి తండ్రి, కొడుకులు మృతి చెందారు. మాచవరం మండలం గోవిందపురంలో ఈ ఘటన జరిగింది. మృతులు పిడుగురాళ్లకు చెందిన తండ్రి, కొడుకులు నీరుమళ్ళ శ్రీనివాసరావు(54) వెంకటేష్ (25) గా గుర్తించారు. ఇద్దరు మృతదేహాలను గజ ఈతగాళ్ళు వెలికి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

#kurnool #krishna-river #bhadradri-kothagudem #ganesh-immersion #disruption #annamaiah #chittoor-districts
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe