Sachin Tendulkar: సచిన్‌ జమ్మూ పర్యటన.. ప్రధాని మోదీ ఏమన్నారంటే

ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి సచిన్‌ టెండుల్కర్‌ జమ్మూకశ్మీర్‌లో పర్యటించగా.. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ సచిన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

New Update
Sachin Tendulkar: సచిన్‌ జమ్మూ పర్యటన.. ప్రధాని మోదీ ఏమన్నారంటే

ప్రముఖ క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి కశ్మీర్‌లో పర్యటించారు. ఇందుకు సంబంధించిన వీడియోనూ ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేశారు. అయితే దీనిపై స్పందించిన ప్రధాని మోదీ.. ఈ పర్యటనలో ఉజ్వల భారత్‌ గురించి చాటిచెప్పడం అద్భుతమని సచిన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. సచిన్‌.. చన భార్య అంజలి, కూతురు సారా టెండుల్కర్‌లో కలిసి కశ్మీర్‌కు వెళ్లారు. అక్కడ పర్యాటక ప్రాంతాలను పలు ఆలయాలను సందర్శించారు. అలాగే పుల్వామా జిల్లాలోని బ్యాట్‌లను తయారు చేసే యూనిట్‌కు కూడా వెళ్లారు.

Also Read: ఎస్పీ చీఫ్‌ అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ సమన్లు.. కారణం ఇదే

ఆయన మాటలతో అంగీకరిస్తున్నా

అంతేకాదు అక్కడి స్థానికులతో కాసేపు క్రికెట్ ఆడారు. విధులు నిర్వహిస్తున్న సైనికులతో కలిసి మచ్చటించారు. తన ట్రిప్‌ వీడియేను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. 'జమ్మూ కశ్మీర్ పర్యటన ఓ అందమైన అనుభూతిగా నా జ్ఞాపకాల్లో నిలిచిపోతుంది. ఈ ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉంది. కానీ ఇక్కడి ప్రజల అసాధరణ ఆతిథ్యం చూసి మేము వెచ్చని అనుభూతి చెందాము. మనదేశంలో చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని ప్రధాని మోదీ చెప్పారు. ఈ ట్రిప్‌ తర్వాత ఆయన చెప్పిన మాటలతో అంగీకరిస్తున్నా. కశ్మీర్‌ విల్లో బ్యాట్లు అనేవి.. మేక్‌ ఇన్ ఇండియా, మేక్‌ ఫర్‌ వరల్డ్‌కు గొప్ప ఉదాహరణలు. ఈ బ్యాట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ప్రపంచ ప్రజలకు, భారతీయులకు నేను చెప్పేదేంటంటే.. జమ్మూకశ్మీర్‌కు వచ్చి ఇక్కడి ప్రకృతిని ఆస్వాదించండి అని' సచిన్‌ రాసుకొచ్చారు.

ఆత్మనిర్భర భారత్‌ నిర్మిద్దాం

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ సచిన్‌ను ప్రశంసించారు. ' అద్బుతంగా ఉంది. మీరు చేసిన ఈ పర్యటన గురించి యువత రెండు విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. అందులో ఒకటి.. ఉజ్వల భారత్‌లో విభిన్న పర్యటక ప్రాంతాలు ఉన్నాయి. రెండు.. మేక్‌ ఇన్ ఇండియా ప్రాముఖ్యత. మనమందరం కలిసి వికసిత, ఆత్మనిర్భర భారత్‌ను నిర్మిద్దామని ప్రధానమంత్రి మోదీ' పేర్కొన్నారు.

Also read: నేను రాజీనామా చేయలేదు.. క్లారిటీ ఇచ్చిన సుఖ్విందర్ సింగ్

Advertisment
తాజా కథనాలు