శబరిమల వెళ్లే స్వాములకు సౌత్ సెంట్రల్ రైల్వే ఓ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక ట్రైన్లను వేస్తున్నట్లు వెల్లడించింది. శబరిగిరికి వెళ్లే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుండడంతో ఆ రద్దీని దృష్టిలో పెట్టుకుని వీటి సంఖ్యను మరింత పెంచే అవకాశాలున్నట్లు అధికారులు వెల్లడించారు.
డిసెంబర్, జనవరి నెలలు ప్రారంభం అయ్యాయంటే..శబరిగిరి కొండకు వెళ్లే భక్తుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాచిగూడ నుంచి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వెల్లడించింది. ఈ నెల 18 నుంచి జనవరి 15 వరకు ఈ ప్రత్యేక కాచిగూడ శబరిమల మధ్య నడపనుంది.
కాచిగూడ-కొల్లం మధ్య ఈ రైళ్లను నడపనుంది. ఈ ప్రత్యేక రైళ్లు కాచిగూడ నుంచి డిసెంబర్ 18 , 25, జనవరి 1, 8,15 తేదీల్లో ప్రారంభం కానుంది. ఇవి తిరిగి కొల్లం నుంచి డిసెంబర్ 20,27, జనవరి 3,10,17 తేదీల్లో తిరిగి బయల్దేరనున్నట్లు అధికారులు వివరించారు. సౌత్ సెంట్రల్ రైల్వే చెప్పిన తేదీల్లో రాత్రి 11 గంటల 45 నిమిషాలకు కాచిగూడ స్టేషన్ లో ఈ ప్రత్యేక రైలు బయల్దేరనుంది.
ఈ రైలు రెండు రోజుల తరువాత ఉదయం శబరిమలకు చేరుకుంటుంది. అంటే 20 వ తేదీన ఉదయం కొల్లం కు చేరకుంటుంది.ఉదయం 10.45 నిమిషాలకు కొల్లం స్టేషన్ లో బయల్దేరనుంది. మూడు రోజుల తరువాత కాచిగూడ స్టేషన్ కి చేరుకుంటుంది. 20 వ తేదీ ఉదయం కొల్లంలో బయల్దేరితే 21 వ తేదీ మధ్యాహ్నం కాచిగూడకి చేరుకుంటుంది.
Also read: కార్తీక మాసం ఆఖరి సోమవారం..శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు!