RRB ALP 2024: అసిస్టెంట్ లోకో పైలట్ రిక్రూట్‌మెంట్ కోసం అర్హత, అశక్తి ఉండి అప్లై చేసుకోని వాళ్లు ఉంటే ఈ న్యూస్ మీకోసమే. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నిర్వహించనున్న అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్‌కు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ్టి(ఫిబ్రవరి 19)తో ముగియనుంది. RRB అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. RRB ALP-2024 రిక్రూట్‌మెంట్‌లో భాగంగా మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ ఖాళీలను బోర్డు భర్తీ చేయనుంది.
వయో పరిమితి
➼ ఈ ఖాళీల కోసం దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు జూలై 1, 2024 నాటికి 18 సంవత్సరాల కంటే తక్కువ, 30 సంవత్సరాలకు మించకూడదు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
➼ RRB ALP 2024 దరఖాస్తు రుసుము SC, ST, Ex-Serviceman, మహిళలు, మైనారిటీ, EBC కేటగిరీ అభ్యర్థులకు రూ. 250. మిగతా వారందరికీ దరఖాస్తు రుసుము రూ. 500.
నియామక ప్రక్రియ:
➼ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ఐదు దశలను కలిగి ఉంటుంది:
➼ మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT 1)
➼ రెండో దశ (CBT 2)
➼ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT)
➼ డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV)
➼ వైద్య పరీక్ష (ME)
➼ అవసరమైన పత్రాలు
అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌తో పాటు కింది పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలి:
➼ JPEG ఫార్మెట్‌లో రిసెంట్ కలర్ పాస్‌పోర్ట్ ఫొటో ఉండాలి. ఫైల్ సైజ్ 30-70 KB ఉండాలి.
➼ JPEGలో స్కాన్ చేసిన సంతకం ఉండాలి. ఫైల్ సైజ్ 30-70 KB ఉండాలి.
➼ SC, ST సర్టిఫికేట్ (వర్తిస్తే) PDF ఫార్మెట్‌లో ఉండాలి. సర్టిఫికేట్ సైజ్ 500 KBకి మించకూడదు. ఉచిత రైలు ప్రయాణ పాస్ కోసం SC, ST సర్టిఫికేట్ అవసరం.
➼ RRB అభ్యర్థులు కనీసం 12 ఫోటో కాపీలను ఉంచుకోవాలి. ఇది తరువాతి దశలలో అవసరమవుతాయి.
విద్యా అర్హత:
➼ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మిల్‌రైట్/మెయింటెనెన్స్ మెకానిక్, మెకానిక్ (రేడియో/టీవీ), ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానిక్ (మోటార్ వెహికల్), వైర్‌మ్యాన్, ట్రాక్టర్ మెకానిక్, ఆర్మేచర్ అండ్ కోయిల్‌లలో అనుభవం ఉండాలి. గుర్తింపు పొందిన NCVT/SCVT సంస్థ నుంచి మెకానికల్ (డీజిల్), హీట్ ఇంజిన్, టర్నర్, మెషినిస్ట్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ ట్రేడ్‌లలో ITI ఉత్తీర్ణులై ఉండాలి.
Also Read: గూడ్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. కేవలం అందుకోసమే.. దీని స్పెషాలిటీస్ ఇవే!