Cricket: ద్రవిడ్ కంటే ముందే 5 కోట్లు వదులుకునేందుకు సిద్ధపడిన రోహిత్

టీమ్ ఇండియాకు బోనస్‌గా బీసీసీఐ 125 కోట్లు ప్రకటించింది. ఆటగాళ్ళతో పాటూ కోచ్ ద్రావిడ్‌కు కూడా 5 కోట్లు ఇవ్వడానికి నిర్ణయించారు. అయితే ద్రావిడ్ అందులో సగం వదులుకుంటానన్నాడు. కానీ అంతకు ముందే కెప్టెన్ రోహిత్ కూడా తన బోనస్ మొత్తాన్ని వదులుకునేందుకు సిద్ధపడ్డాడని తెలుస్తోంది.

Cricket: ద్రవిడ్ కంటే ముందే 5 కోట్లు వదులుకునేందుకు సిద్ధపడిన రోహిత్
New Update

Captain Rohith Sarma: టీమ్ ఇండియా క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్‌ ద్రావిడ్‌లు ఒకరితో ఒకరు పోటీ పడుతూ పెద్ద మనసు చాటుకుంటున్నారు. సహాయక సిబ్బంది కోసం తమ బోనస్ లను వదులుకోవడానికి సిద్ధపడ్డారు. కోచ్ రాహుల్ ద్రావిడ్ తనకు అందించే బోనస్‌ను సగానికి తగ్గించాలని బీసీసీఐని కోరారు. మిగతా కోచ్‌లకు ఇచ్చిన విధంగానే రూ.2.5 కోట్లు ఇవ్వాలని ద్రవిడ్ విజ్ఞప్తి చేశాడు. అయితే అంతకు ముందే కెప్టెన్ రోహిత్ శర్మ తన ప్రైజ్ మనీ మొత్తాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డాడని చెబుతున్నారు. జట్టు గెలుపు కోసం శ్రమించిన సహాయక సిబ్బందిలో అందరికీ సమానంగా డబ్బు అందాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జట్టు గెలుపు కోసం త్రోడౌన్‌ స్పెషలిస్ట్‌లు, మసాజర్స్‌, ఫిజియోలు ఇలా ఎంతోమంది శ్రమించారు. తక్కువ వేతనం వచ్చిన సహాయ సిబ్బందిలో అందరికీ సమానంగా నా ప్రైజ్‌ మనీ చెందాలని ఆశిస్తున్నా అని రోహిత్ చెప్పాడు.

టీ20 వరల్డ్‌కప్‌ స్క్వాడ్‌లోని 15 మంది ప్లేయర్లకు రూ.5 కోట్లు చొప్పున అనౌన్స్ చేసింది బీసీసీఐ. రిజర్వ్‌ ఆటగాళ్లకు రూ.కోటి.. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్‌ దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ఒక్కొక్కరికి రూ.2.5 కోట్లు, చీఫ్‌ సెలక్టర్‌ అజిత్ అగార్కర్‌తో సహా సెలక్షన్ కమిటీ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.కోటి ప్రకటించారు. సహాయక సిబ్బందిలో ముగ్గురు ఫిజియోథెరపిస్ట్‌లు, ముగ్గురు త్రోడౌన్ స్పెషలిస్టులు, ఇద్దరు మసాజర్‌లు, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌లకు ఒక్కొక్కరికి రూ.2 కోట్లు అందించాలని బీసీసీఐ నిర్ణయించింది.

Also Read:Ambani’s Wedding: 3 వేల వంటకాలు..1500 కోట్లు ఖర్చు..

#cricket #dravid #team-india #prize-money #rohith-sarma
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe